స్టాన్ ఫోర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ జోనతాన్ లెవిన్ తో మంత్రి లోకేష్

First Published Sep 1, 2017, 3:58 PM IST
Highlights
  • లోకేష్ ఈరోజు చెన్నై లో స్టాన్ ఫోర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ జోనతాన్ లెవిన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు
  • రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని స్టాన్ ఫోర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ జోనతాన్ లెవిన్ ను కోరిన మంత్రి నారా లోకేష్

 

 ఏపీ రాష్ట్ర మంత్రి లోకేష్ ఈరోజు చెన్నై లో స్టాన్ ఫోర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ జోనతాన్ లెవిన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిరువు పలు అంశాలపై చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, రియల్ టైం గవర్నెన్స్, ఐ. టి అభివృద్ధి, స్టార్ట్ అప్ యాసిలిరేటర్

,గ్రామాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాల ను స్టాన్ ఫోర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ జోనతాన్ లెవిన్ కు ఈ సందర్భంగా లోకేష్ వివరిచారు. అంతేకాకుండా తమరాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయనను లోకేష్ కోరారు.

స్టాన్ ఫోర్డ్ బిజినెస్ స్కూల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీడ్ యాసిలిరేటర్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచెయ్యడానికి జోనతాన్ లెవిన్ అంగీకరించారు.సీడ్ యాసిలిరేటర్ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం అయ్యే స్టార్ట్ అప్ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదిగేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.డి మిక్స్ ఇంటర్న్ షిప్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు.

click me!