
రోడ్లకి, బాటలకి నాయకుల పేర్లు పెడుతూ ఉంటారు. ఆ రోడ్డు ఒక వాన రాగానే కొట్టుకుపోతుంది. అపుడు పేరు గొప్ప ఊరు దిబ్బలా తయారవుతుంది. ఇది అన్ని విధాల నష్టం.
నాయకుడి పేరు ఖరాబవుతుంది. ప్రభుత్వం నిధులు వృధాఅవుతాయి. ఇంత అధ్వాన్నంగా రోడ్డే సిన పెద్ద మనిషి ఎవరో ఎవరికీ తెలియదు. మన రోడ్ నిర్మాతలిలా అనామకుడిగా ఉండిపోకూడదు.
దీనికి సోషల్ మీడియా నుంచి ఒక సలహా వచ్చింది.
రోడ్డేసినపుడల్లా దానికి ఆ కాంట్రాక్టర్ పేరు పెట్టాలి. అపుడు రోడ్డు గాలికి లేచిపోయినా, వానకు కొట్టుకుపోయినా, కాంట్రాక్టర్ ను జనమంతా తిట్టడం మొదలుపెడతారు. థూ అని ఉమ్మేస్తుంటారు. జనాగ్రహం కూడా ఎదో ఒక రూపం కాంట్రాక్టర్ దగ్గిరకు పోతుంది. రోడ్లు కొంతయినా బాగపడ్తాయని ఆశ.
ఈ సలహా బాగానే ఉందనిపిస్తా ఉంది.