
నేడు భారత మహిళా జట్టులోని పలువురు క్రీడాకారిణులను వీరేంద్ర సెహ్వాగ్ కలిశాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా సెహ్వాగ్ పంచుకున్నారు. దేశాన్నిఎంతో గర్వపడేలా చేసిన ఈ అమ్మాయిలను కలవడం ఎంతో సంతోషంగా ఉందని కితాబిచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. సోషల్ మీడియా ట్విట్టర్ లో వారితో కలిసి దిగిన ఫోటోకు ఇలా ట్యాగ్ చేశారు... ‘మనల్ని ఎంతో గర్వపడేలా చేసిన ఈ అమ్మాయిలను కలవడం ఎంతో సంతోషంగా ఉంది’ ఆయన తెలిపారు.
మహిళ క్రికెట్ జట్టులో సెహ్వాగ్ కు వీరాభిమాని అయిన హర్మన్ ప్రీత్ కౌర్ ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. జట్టులో ఉన్న పేసర్ జులన్ గోస్వామి, స్టార్ బ్యాట్స్ ఉమన్ వేద కృష్ణమూర్తి, స్పిన్నర్స్ ఏక్తా బిస్త్, పూనమ్ రౌత్, రాజేశ్వరి సెహ్వాగ్ ను కలవడం చాలా సంతోషంగా ఉందని తమ ట్విట్టర్ ద్వారా పెర్కోన్నారు.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించిన భారత జట్టుకు ప్రశంసలు కొనసాగుతున్నాయి. భారత మహిళ జట్టు ఫైనల్ లో ఇంగ్లాంగ్ తో ఓడిపోయి రన్నర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.