అనంతపురం కార్ల తయారీకి భూమి పూజ

First Published Jun 1, 2017, 4:19 PM IST
Highlights

 అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలనుకుంటున్న కియా కార్ల ఫ్యాక్టరీ  పనులు ప్రారంభమయ్యాయి. పెనుగొండ సమీపంలోని ఎర్రమంచి గ్రామంలో భూమి చదను చేసే పనులు ప్రారంభించేందుకు ఈ రోజు భూమి పూజ చేశారు.  భూమిని చదునుచేయడానికి సంబంధించిన  కాంట్రాక్టను కియా కంపెనీ ఎల్ అండ్ టి కి అప్పగించింది.  భూమి పూజ కార్యక్రమంలో కొంతమంది స్థానిక అధికారులు, ఎల్ అండ్ టి  సిబ్బంది పాల్గొన్నారు.

 

 అనంతపురం జిల్లాలోల ఏర్పాటు చేయాలనుకుంటున్న కియో కార్ల ఫ్యాక్టరీ  పనులు ప్రారంభమయ్యాయి. పెనుగొండ సమీపంలోని ఎర్రమంచి గ్రామ సమీపంలో భూమి చదను చేసే పనులు ప్రారంభించేందుకు ఈ రోజు భూమి పూజ చేశారు.  భూమిని చదునుచేయడానికి సంబంధించిన  కాంట్రాక్టను కియో కంపెనీ ఎల్ అండ్ టి కి అప్పగించింది.  ఈ రోజు భూమి పూజ కార్యక్రమంలో కొంతమంది స్థానికి అధికారులు, ఎల్ అండ్ టి సబ్బంది పాల్గొన్నారు.

 

కియో కార్ల కంపెనీ ఏర్పాటు కోసం పెనుగొండ సమీపంలో  550 ఎకరాల భూమిని ఇది వరకే సేకరించారు.అరునెలలో ఈ భూమిని చదును చేసి  కియోకంపెనీకి అప్పగించడం జరగుతుందని ఎల్ అండ్ టి సిబ్బంది  ఏషియానెట్ కు తెలిపారు.

 

కియా మోటార్స్ కార్ల పరిశ్రమతో కరవు జిల్లా అనంతపురము రూపురేఖలే పూర్తిగా మారిపోతాయని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆటోమోటివ్ రంగంలో అతి పెద్ద సంస్థగా వున్నా కియా మోటార్స్ ఆంధ్రాకు రావడం,అందునా అనంతపురం జిల్లా ఈ యూనిట్ స్థాపనకు ఎంపిక కావడం ఒక చరిత్రాత్మక అంశం అని ఆయన అన్నారు.

 

  13 వేల కోట్ల పెట్టుబడితో వస్తున్న కియా కార్ల ఫ్యాక్టరీలో  11 వేల ఉద్యోగలుంటాయని అంచనా. ఇందులోని  90శాతం స్థానిక యువకులకు అందివ్వడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు  మే నెల 1 వ తేదీన, కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం  చెప్పారు.

పెనుకొండలో ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యంతో ప్లాంటును కియా నిర్మిస్తుంది.

 

ఒప్పందం ప్రకారం, 2019 చివరి కల్లా పెనుగొండ  కార్ల ఉత్పత్తి ప్రారంభిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్లాంటు నిర్మాణం మొదలవుతుంది. భారతీయ మార్కెట్ అవసరాలకు తగినట్టుగా హ్యాచ్ బ్యాక్, సెడాన్, కాంపాక్ట్, ఎస్‌యూవీ తరహా కార్లు తయారవుతాయి.

 

 

 

 

 

click me!