అద్వానీ రాష్ట్రపతి కాకుండా కుట్ర

Published : Apr 19, 2017, 11:42 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
అద్వానీ రాష్ట్రపతి కాకుండా కుట్ర

సారాంశం

బాబ్రి మసీదు కూల్చివేత  కుట్రకేసు విచారణ తిరగదోడం వెనకే అసలు కుట్ర అద్వానీ రాష్ట్రపతి కాకుండా అడ్డుకోవడమే: లాలూ ప్రసాద్ యాదవ్

బాబ్రీ మసీదు కేసు పునర్విచారణ అద్వానీపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు.

 

బాబ్రి మసీదు కూల్చివేత  కుట్రకేసు విచారణ తిరగదోడం వెనకే అసలు కుట్ర ఉందని ఆయన వ్యాఖానించారు.

 

‘సిబిఐని నడిపించేదెవరు? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.  ఇలాంటి సిబిఐ, ఈ రోజు అద్వానీ కి వ్యతిరేకంగా బాబ్రివిధ్వంస  కుట్ర కేసు విచారణ జరగాల్సిందేనని కోర్టు కు చెబుతున్నది. వచ్చే రాష్ట్రపతి అద్వానీయే అని కొద్ది రోజులుగా  ప్రచారం లో ఉంది. అలాంటపుడు కుట్ర కేసులో  అద్వానీ ఇరుక్కుపోతే, ఇక ఆయన రాష్ట్ర పతి పదవి రేసులో ఎలా ఉంటారు,’ అని లాలూ ప్రశ్నించారు.

 

అద్వానీ రాష్ట్రపతి అయ్యే అవకాశమే లేకుండా ప్రధాని చేశారని ఆరోపించారు.

 

రాష్ట్రపతి ఎన్నికలు ఈ ఏడాది జూలై జరగుతున్నాయి. బిజెపి ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోయినా,  అద్వానీ పేరు ప్రముఖంగా వినబడుతూ వస్తున్నది. ఆయన మీద బాబ్రి విధ్వంసం కేసు నమోదయితే  రాష్ట్రపతి పదవికి పోటీచేసేందుకు అనర్హులవుతారని లాలాచెబుతున్నారు.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !