కర్నూలులో 300 ఎలుకలు చంపేందుకు 60 లక్షల ఖర్చు

Published : Jul 05, 2017, 03:34 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
కర్నూలులో 300 ఎలుకలు చంపేందుకు 60 లక్షల ఖర్చు

సారాంశం

300 ఎలుకలు పట్టేందుకు ఖర్చు రు.60 లక్షలు. అవును నిజమే. ఒక్కొక్క ఎలుకనుపట్టుకునేందుకు రు. 20 వేలు. అవును అదీ నిజమే. వీటిని పట్టుకునేందుకు ఒక కంపెనీ ఏడాది కష్టపడింది. అదీ నిజం. ఇది జరిగింది కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో. అయితే, కాంట్రాక్టర్ మంత్రిగారికి క్లోజ్ కాబట్టి ఎవరూ మాటాడటానికి వీల్లేదు.

300 ఎలుకలు పట్టేందుకు ఖర్చు రు.60 లక్షలు. అవును నిజమే. ఒక్కొక్క ఎలుకనుపట్టుకునేందుకు రు. 20 వేలు. అవును అదీ నిజం. వీటిని పట్టుకునేందుకు ఒక కంపెనీ ఏడాది కష్టపడింది. అదీ నిజం. ఇది జరిగింది కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో. అయితే, కాంట్రాక్టర్ మంత్రిగారికి క్లోజ్ కాబట్టి ఎవరూ మాటాడటానికి వీల్లేదు.

 

కర్నూలు జనరల్  ఆసుప్రతిలో ఎలుకలు పట్టడం చాలా కష్టమయిన పనయిపోయిందని, భావించి డాక్టర్లు ఏకంగా ఎలుకలను పట్టి సంహరించే ప్రాజక్టును ఒక ఏడాది పాటు అమలుచేశారు. ఈ కాంట్రాక్టు నెలకు అయిదులక్షల చొప్పున ఒక ప్రయివేటు ర్యాట్ కిల్లర్ కంపెనీకి అప్పచెప్పారు.

 

 జూన్ 2016 నుంచి జూన్ 2017 దాకా ఈ ప్రాజక్టు ఎలుకను పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఏడాది పాటు శ్రమించి, అరవై లక్షలు ఖర్చుచేసి మొత్తానికి 300 ఎలుకలు పట్టారు.

 

కర్నులు జనరల్ ఆసుపత్రిలో బొక్కలు తవ్వి, సొరంగలేసుకుని ఈ ఎలుకలు విచ్చలవిడిగా తిరుగుతూ ఆసుప్రతి ఆస్తులకే కాదు, పక్కనే ఉన్న రైల్వే లైన్ కూడా హాని చేస్తూ ఉండటతో వాటి అంతు  తేల్చాలనుకున్నారు. ఎలుకలతో పాటు పందికొక్కులను పట్టుకోవాలి.  దీనికోసం కాంట్రాక్ట్ ర్యాట్ కిల్లర్స్ ను అప్పాయంట్ చేశామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరా  స్వామి చెబుతున్నారు.

 

మరి 300 ఎలుకలు పట్టేందుకు రు. 60 లక్షలు ఎలా ఖర్చయ్యాయంటే, ఎలుకల కాంట్రాక్టర్ ఆరోగ్య శాఖ మంత్రి  కామినేని శ్రీనివాస్ గారి మనిషి. అందువల్ల కాంట్రాక్టర్ మీద మనకు ఎలాంటి కంట్రోలుండదని ఆయన  మీడియా కు చెప్పారు.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !