ఐటి ఉద్యోగాలలో బెంగుళూరే నెంబర్ వన్

First Published Jul 5, 2017, 1:23 PM IST
Highlights

సాఫ్ట్ వేర్ ఉద్యోగాలలో  ఇప్పటికీ నెంబర్ వన్ బెంగుళూరే, రెండోొస్థానం హైదరాబాద్ దే. అయితే, హాార్డ వేర్ ఉద్యోగాలలో మాత్రం మొదటి స్థానం ఢిల్లీది, రెండోస్థానం బెంగుళూరుది. హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది.

 

చాలా ఐటి కంపెనీలు  ఉద్యోగాలలోకోత విధిస్తున్నా, ఇప్పటికీ ఐటి ఉద్యోగాలలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలబడి ఉంది. నెంబర్ వన్ స్థానం బెంగుళూరుదే. ఢిల్లీలోని ఒక సర్వే సంస్థ అధ్యయనంలో ఇది వెల్లడయింది.

 

Youth4work.com అధ్యయనం  ప్రకారం దేశంలోని మొత్తం ఐటి ఉద్యోగాలలో 30 శాతం ఉద్యోగాలను అందిస్తున్నది బెంగుళూరు నగరమే.తర్వాత రెండో స్థానం19 శాతంతో హైదరాబాద్ కు దక్కింది. 17 శాతంతో ఢిల్లీ మూడో స్థానంలో ఉంటే 12 శాతంతో అహ్మదాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ఛెన్నై, ముంబాయిలు 11 శాతంతో చివరిస్థానంలో ఉన్నాయి. హార్డ్ వేర్ ఇంజనీరింగ్, తదితర రంగాల ఉద్యోగాలలో కూడా  బెంగుళూరు నెంబర్ వన్ గా ది. మొత్తం ఐటి ఉద్యోగులలో  30శాతం మంది బెంగుళూరులో ఉన్నారు. హైదరాబాద్ లో ఉండేది కేవలం 18 శాతమే. చెన్నై, ఢిల్లీల వాట 17 శాతమే. ముంబయిలో 14 శాతం ఉంటే అహ్మదాబాద్ లో కేవలం 4 శాతం ఐటి ఉద్యోగాలే ఉన్నాయి.

 

సాఫ్ట్ వేర్ ఉద్యోగాలలో  28శాతంతో బెంగుళూరు నంబర్ వన్ స్థానంలోఉంటే  23 శాతంతో హైదరాబాద్ ద్వితీయ స్థానంలో ఉంది.  ఇక హార్డ్ వేర్ కు సంబంధించి ఢిల్లీది అగ్రస్థానం. అక్కడ 26 శాతం హార్డ్ వేర్ ఉద్యోగాలు ఢిల్లీలోనే ఉన్నారు. బెంగుళూరులో 24 శాతం,  హైదరాబాద్ లో 20శాతం హార్డ్ వేర్ ఉద్యోగులున్నారు.

 

అయితే, ఒక ఆసక్తి కరమయిన విషయం ఈ సర్వేలో వెల్లడయింది. గతంలో కేవలం బెంగుళూరు, హైదరాబాద్ నగరాలకే పరిమితమయిన ఐటి ఉద్యోగాలు ఇపుడు ఇతర నగరాలకు కూడా విస్తరిస్తున్నాయి.

 

click me!