పాక్ ఇతన్ని ఎప్పుడో చంపేసింది..!

Published : Apr 11, 2017, 02:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
పాక్ ఇతన్ని ఎప్పుడో చంపేసింది..!

సారాంశం

హోం శాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.సింగ్ అనుమానాలు

భారత్ మాజీ నేవీ ఆఫీసర్ కుల్ భూషణ్ ను పాక్ చంపేసిందా.. ఆ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకే ఇప్పుడు అతడికి మరణశిక్ష విధించినట్లు చెబుతుందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

 

ఎందుకంటే హోం శాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.సింగ్ ఈ విషయంపై వ్యక్తం చేస్తున్న అనుమానాలు అతడి హత్యను బలపరుస్తున్నాయి.

 

పాక్ ఆర్మీకి చిక్కిన కుల్ భూషణ్ ను విడుదల చేసేందుకు, అతడితో మాట్లాడేందుకు ఇప్పటి వరకు భారత్ 13 సార్లు ప్రయత్నించిదట. అయినా పాక్ ఈ విషయంలో ఒక్కసారి కూడా స్పందించలేదట. బహుశా కులభూషణ్‌ను చిత్రహింసలు చేసి చంపేసి ఉండొచ్చని  సింగ్ అభిప్రాయపడుతున్నారు.

 

ఆ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా, తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకే పాక్ ఇప్పుడు ఉరిశిక్ష అంటూ కొత్త నాటకం మొదలుపెడుతోందని ఆయన ఆరోపించారు.

 

ఇప్పటికైన భారత ప్రభుత్వం పాక్ రాయబార కార్యాలయంతో మాట్లాడి అతడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !