
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ శ్రీలంక లో పుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. లంక పర్యటనకు వెళ్లిన కోహ్లీ సేనా ఇప్పటికే టెస్టు సిరీస్‌లో 3-0తో ఘన విజయం సాధించిన సంగంతి తెలిసిందే. అనంతరం వన్డే మ్యాచ్‌లకు విరాట్‌కు వారం పాటు విరామం దొరకడంతో అనుష్కతో కలిసి పలు ప్రదేశాలను సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇప్పటికే శ్రీలంకలోని పలు దర్శనీయా ప్రాంతాలు తిరిగిన కోహ్లీ-అనుష్కల జంట. ప్రస్తుతం ఆ ఫోటోలు ఒక్కోక్కటిగా సోషల్ మీడియాలో బయటికి వస్తున్నాయి. శనివారం లంకలోని అలియా రిసార్ట్ అండ్ స్పాలో కోహ్లీ, అనుష్క శర్మ మొక్కలు నాటారు. సమయం దొరికినప్పుడల్లా ఈ జంట ఏదో ఒక పని నిమగ్నమైపోయి సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శ్రీలంకలో గత వారంలో భారత్ కోచ్ రవి శాస్త్రితోపాటు తన ప్రియురాలు అనుష్కతో కలిసి కోహ్లీ ఓ హోటల్‌లో ఫొటోలు దిగి సందడి చేశారు. కోహ్లీ-అనుష్క లు ఇద్దరు శ్రీలంకలో ఫ్యాన్స్ దిగిన ఫోటోలు కూడా గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తున్నాయి.