
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 73వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనను ప్రధాని నరేంద్రమోదీ స్మరించుకున్నారు. ఈ మేరకు మోదీ ఆయనకు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. 1944 ఆగస్టు 20వ తేదీన జన్మించిన రాజీవ్ గాంధీ.. మే 21, 1991లో మరణించారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. దిల్లీలోని ఆయన సమాధి వీర్ భూమి వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ , ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలు కూడా పాల్గొన్నారు.