కెటిఆర్ ఇలాకాలో కోదండరామ్ యాత్ర

First Published Jul 7, 2017, 4:45 PM IST
Highlights

టిజాక్ అమర వీరుల స్ఫూర్తియాత్ర రేపు కెటిఆర్ కోట సిరిసిల్ల  రాజన్న జిల్లాలో ప్రవేశిస్తున్నది. రాష్ట్రం వచ్చాక కూడా పట్టి పీడిస్తున్న సమస్యల మీద జన సమీకరణ కోసం టిజాక్ ఛెయిర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఈ యాత్ర  మొదలుపెట్టారు. మొదటి విడత వ్యవసాయ సమస్యల మీద సిద్ధిపేట ప్రాంతంలో సాగింది.రేపటి  నుంచి సోమవారం వరకు సిరిసిల్ల రాజన్న జిల్లాల్లో ఆయన బస్సు యాత్ర సాగుతుంది.

జేఏసీ రెండో విడత అమరవీరుల స్ఫూర్తి యాత్ర రేపటి నుంయచి సోమవారం వరకు సిరిసిల్ల రాజన్న జిల్లాల్లో  సాగుతుంది.

సికింద్రాబాద్ లో అమరవీరుల స్థూపం నివాళులు అర్పించి అక్కడి  నుండి యాత్ర  సిరిసిల్ల వైపు సాగుతుంది.  

మొదటి యాత్ర లో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రెండో దశలో  జిల్లాలో ముఖ్యమయిన బీడీ, చేనేత కార్మికుల సమస్యలపై, జిల్లాల్లో నెలకొన్నఇతర సమస్యలపై సాగుతుంది.

ఈ వివరాలందిస్తూ, సిరిసిల్ల రాజన్న జిల్లాల్లో ఇసుక మాఫియా అధికంగా ఉందని, అక్కడ ఉన్న స్థానిక నాయకులే ద్వార నే ఈ దందా జరుగుతున్నదని కోదండరామ్ అన్నారు.

నిరుద్యోగుల సమస్యను ప్రస్తావిస్తూ ఎస్సై కానిస్టేబుల్ నియామకం లో నోటిఫికేషన్ లు వచ్చి, పరీక్షలు కూడా రాసినా రిక్రూట్ మెంట్ ప్రాసెస్ పూర్తికాకపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం క్తం చేశారు.

‘ఇప్పటికి ఫలితాలు వెల్లడించలేదు.దీనిపై అభ్యర్థులలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరీక్షల గురించి వారికి కనీసం సమాచారం కూడా లేకుండా ఉంది..

ఫలితాలు వస్తాయారావా, ఉద్యోగాలొస్తాయా రావా అని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు,’  ఆయన విచారం వ్యక్తం చేశారు.

‘హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెట్టి నన్నుంతిట్టడం కాదు, వాస్తవాలు తెలుసుకోవాలంటే తెరాస నాయకులు మహబూబ్ నగర్ వెళ్లి డిండి ప్రాజెక్ట్ ను పరిశీలించాలి,’ అని టిఆర్ ఎస్ నేతలకు మంత్రులకు సలహా ఇచ్చారు.

 

click me!