కీరన్ పొలార్డ్ కి ఏమైంది....?

Published : Sep 05, 2017, 01:53 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
కీరన్ పొలార్డ్ కి ఏమైంది....?

సారాంశం

లూయిస్ రికార్డు సెంచరీని అడ్డుకున్న కీరన్ పోలార్డ్. నో బాల్ వేసి సెంచరీని  అడ్డుకున్నాడు. పొలార్డ్ పై నెటిజన్ల ఆగ్రహాం.

 కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఒక విచిత్ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. లీగ్‌లో సోమ‌వారం సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నీవిస్‌ పాట్రియాట్స్ జ‌ట్టుకు, బార్బడోస్‌ ట్రిడెంట్స్ జ‌ట్టుకు మ‌ధ్య‌ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ జ‌ట్టు ఒక్క ప‌రుగు చేస్తే విజ‌యం సాధిందేది. అలాగే ఈ జ‌ట్టులో ఉన్న లూయిస్ మ‌రో మూడు ప‌రుగులు చేస్తే రికార్డు సెంచ‌రీ చేస్తాడు( 32 బంతుల్లోనే సెంచ‌రీ). కానీ అప్పుడే బార్బడోస్ జ‌ట్టుకి ప్రాతినిధ్యం వహిస్తోన్న కీరన్‌ పొలార్డ్ ఉద్దేశ‌పూర్వ‌కంగా నో బాల్ వేశాడు. దీనితో ఎవిన్‌ లూయిస్ రికార్డు శతకం తృటిలో చేజాపోయింది. 


 ఈ రెండు జ‌ట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బార్బడోస్‌ జట్టు 128 పరుగులు చేసింది. అనంతరం సెయింట్‌ కిట్స్‌ జట్టు ఛేదన‌కి దిగింది, క్రిస్‌ గేల్‌- లూయిస్ జంట ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఈ ఇద్దరి వీరోచిత ఇన్నింగ్స్‌తో 7 ఓవర్లలోనే సెయింట్‌ కిట్స్‌ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. 7వ ఓవర్‌ వేసేందుకు కీరన్‌ పొలార్డ్‌ బంతిని అందుకున్నాడు. ఆ ఓవ‌ర్ లో ఐదు బంతులు వేశాడు. ఆ స‌మ‌యంలో ఒక రన్‌ తీస్తే సెయింట్‌ కిట్స్‌ జట్టు విజయం సాధిస్తుంది. కానీ పొలార్డ్ లూయిస్ సెంచ‌రీని అడ్డుకున్నాడు. కానీ నో బాల్‌ వేసి అతని శతకాన్ని అడ్డుకున్నాడు.

 

అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ పొలార్డ్ పై విమ‌ర్శ‌లు వ‌ర్షం కురిపిస్తున్నారు. క్రీడాస్ఫూర్తి లేకుండా ఇలాంటి ప‌ని చేసినందుకు నెటిజన్లు పొలార్డ్‌పై మండిపడుతున్నారు.

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి..

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu