‘నీట్’ పరీక్ష పేరుతో విద్యార్థిని బ్రా విప్పించారు

Published : May 08, 2017, 01:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
‘నీట్’ పరీక్ష పేరుతో విద్యార్థిని బ్రా విప్పించారు

సారాంశం

విద్యార్థులకు ఇప్పుడు పరీక్ష రాయడమే అసలు పరీక్ష అవుతోంది. వాళ్లేమీ ఉగ్రవాదులు కాదు.. అరాచకశక్తులు అంతకంటే కాదు... కానీ, నిబంధనల పేరుతో శరీరమంతా పరీక్షించి ఏగ్జామ్ కు అనుమింతించే పైశాచిక చర్యలకు దిగుతున్నారు కొందరు అధికారులు.

వెనక నుంచి ఏనుగు పోయినా ఫర్వాలేదు ముందునుంచి మాత్రం ఈగ కూడా వెళ్లడానికి వీళ్లేదని భీష్మించుక కూర్చున్నట్లున్నారు మన విద్యాధికారులు.

 

అడ్డగోలు నిబంధనలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకునే కొత్త ప్రయత్నాన్ని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వేగంగా అందిపుచ్చుకుంటుంది. వాటికి తమదైన రీతిలో కొత్త నిబంధనలు జోడించి మరింత అతి చేస్తోంది.

 

ఈ విషయంలో మేం ఏమీ తక్కువకాదని ఇప్పుడు నీట్ పరీక్ష నిర్వహకులు ముందుకొచ్చారు.

 

గతంలో ఓ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు అనుమతివ్వాలంటే మంగళసూత్రం తీయాల్సిందేనని విద్యార్థినికి నిబంధన పెట్టిందని అందరూ ముక్కున వేలేసుకున్నారు. నీట్ నిర్వహకులు వీళ్లను మించి పోయారు. తాము అంతకుమించి అని వికృత చేష్టలు చేసి మరీ నిరూపించుకున్నారు.

 

గత ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రెన్స్ టెస్ట్) ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో చేరేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.

 

దేశవ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 104 పట్టణాలలో పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్ష కోసం పెట్టిన నిబంధనలు చూస్తే బాబోయ్ అనాల్సిందే. కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా ఉన్నాయి వీళ్ల నిబంధనలు.

 

పొడుగు చొక్కా వేసుకుంటే అనుమతి లేదు. హేయిర్ పిన్నులు పెట్టుకుంటే పరీక్ష రాయనీవ్వరు. బూట్లు వేసుకోకూడదు. జీన్స్ పాయింట్ కు బటన్లు ఉండొద్దు, అమ్మాయిలు చెవి రింగులు పెట్టుకోవద్దు. ఇలా చెప్పుకుంటూ పోతే వారి నిబంధనలు నీట్ సెలబస్ అంత పెద్దగా ఉన్నాయి.

 

పరీక్ష రాయడానికి వచ్చే వారిని ఉగ్రవాదుల్లాగా పరీక్షడమేంటో, శరీరమంతా స్కానర్లతో గుచ్చిగుచ్చి చూడటమేంటో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. కొన్ని చోట్ల ఇవేం పనులని నిలదీశారు.

 

అయితే పరీక్ష నిర్వహకులు మాత్రం నిబంధనలంటూ తమ పని తాము కానిచ్చారు.

 

ఆదివారం జరగిన పరీక్షలో దేశవ్యాప్తంగా ఇదే తంతు. ఇక కొన్ని సెంటర్లలో అయితే నిర్వహకులు మరీ అతిగా ప్రవర్తించారు.

 

కేరళలోని ఓ సెంటర్లో పరీక్షకు హాజరయ్యే విద్యార్థి బ్రా లో మెటల్ బటన్ ఉందని హాల్లోకి అనుమతించలేదు. ఆమె బ్రా విప్పాకే అనుమతిచ్చారు.

అదే స్కూల్లో ఆమె తల్లి కూడా పనిచేస్తోంది. ఈ విషయం తెలిసినా పాప భవిష్యత్తు కోసం మౌనంగా ఉండిపోయిందట.

 

ఇక బెంగళూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పుల్ షర్ట్ వేసుకున్నవాళ్లందరినీ పరీక్షకు అనుమతించలేదు. ఈ విషయం ముందే తెలిసిన ఓ బట్టల షాపు యజమాని పరీక్ష హాలు ముందే హాఫ్ షర్ట్ లను అమ్మకానికి పెట్టి తన వ్యాపారఎత్తుగడను ప్రదర్శించాడు.

 

ఇక ఈ విషయంలో మన  తెలుగు రాష్ట్రాల నిర్వహకులు కూడా ఏమీ తక్కువ తినలేదు. తెలుగు మీడియంలో పరీక్షకు కూర్చున్న విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ మీడియం ప్రశ్నపత్రాలను ఇచ్చి తమ మేధస్తును దేశవ్యాప్తంగా చాటుకున్నారు.

 

అసలు ఇలాంటి పరీక్ష నిర్వహకులను దేశ సరిహద్దుల్లోని భద్రతా విభాగంలోనో లేదా ఏయిర్ పోర్టు లో చెకింగ్ కౌంటర్ లో పెడితే బాగా పనిచేస్తారని చాలా మంది గట్టినమ్మకం.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !