
ఉత్తర ప్రదేశ్ కు బజెపి ఎమ్మెల్యే మహిళా ఐపిఎస్ ఆఫీసర్ కంటతడిపెట్టేలా చేశారు.
ఈ సంఘటన ముఖ్యమంత్రి పార్లమెంటరీ నియోజకవర్గం గోరఖ్ పూర్ లోని కరీం నగర్ ఏరియాలో జరిగింది.
అక్కడ కొంతమంది ప్రజలు ఒక లిక్కర్ షాపునకు వ్యతిరేకంగా నిరసన చెబుతున్నారు. అపుడు పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేశారు.
ఈ విషయాన్ని నిరసన కారులు స్థానిక ఎమ్మెల్యే రాధా మోహన్ దాస్ అగర్వాల్ కు ఫిర్యాదుచేశారు. పోలీస్ సర్కిల్ ఆఫీసర్ చారు నిగమ్ మీద ఎమ్మెల్యే చిందులేశారు.నానా మాటలన్నారు. ‘హద్దు మీరొద్దు అని అరిచారు. తాను నిరసన కారులను తొలగించినందుకు ఎమ్మెల్యేకు కోపం మొచ్చిందని ఆమె కర్చీఫ్ తో కళ్లొత్తుకుంటా చెప్పారు. అయితే, ఆమె నిరసనకారుల పట్ల దురుసుకుగా ప్రవర్తించారరని, 8ం సంవత్సరాలున్న వృద్దురాలినొకరని కొట్టారని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఈ గొడవ కెమెరాకు చిక్కింది.వైరల్ అయింది.