
శృంగేరీ జగద్గురువులను కేరళ ప్రభుత్వం ‘ప్రభుత్వ అతిధి’ గుర్తింపు నిచ్చింది. దీనితో జగద్గురువుల ఎక్కడకి వెళ్లినా పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆయన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పోలీస్ బ్యాండ్ తో స్వాగతించడం ఆనవాయితి. జిల్లాలోని ఉన్నతాధికారులంతా వచ్చి ఆయన స్వాగతం చెప్పి నగరంలోకి ఆహ్వానిస్తారు. ఆయన పోలీసు వందనం ఇలా ఉంటుంది. ఇది చాలా అరుదైన విశేషం. శృంగేరీ కేరళలోనే ఉన్నా దక్షిణాది నాలుగు రాష్ట్రాలు కూడా శంకరాచార్యులవారికి సమానం.అయితే, మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఇలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ఎక్కువ కాలం కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్నా కేరళలో ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది.