
సామాజిక సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ‘రెడ్డి హాస్టల్’ ను స్థాపించారు. దీని స్థాపన జరిగి దాదాపు 100 సంవత్సరాలు కావస్తోంది. దీంతో ‘రెడ్డి హాస్టల్’ శత సంవత్సర వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే మరో నూతన రెడ్డి హాస్టల్ నిర్మాణించేందుకు ప్రభుత్వం యతిస్తోంది. త్వరలోనే దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
వెంకట్రామిరెడ్డి జ్ఞాపకార్థం బద్వేల్ లో ఈ నూతన హాస్టల్ ని ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం 10ఏకరాల భూమి, రూ.10కోట్లు కేటాయించారు. వెంకట్రామిరెడ్డి జయంతి సందర్భంగా ఆగస్టు 22న ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించతలపెట్టారు.
వెంకట్రామిరెడ్డి జయంతి వేడుకలు, హస్టల్ శత సంవత్సర వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. ఇందు కోసం నిధులు కూడా కేటాయించినట్లు ఆయన తెలిపారు.