
లక్ష్మాపూర్ గ్రామస్థులకు కెసిఆర్ బహుమతి ప్రకటించారు.
ఈ రోజు ఆయన ఈ వూరిని సందర్శించారు. అక్కడ ప్రజలనుద్దేశంచి ప్రసంగించారు. లక్ష్మాపూర్ ని పూర్తిగా అభివృద్ధికి తాను పూనుకుంటున్నానని, స్థానిక చెరువును గోదావరి నీళ్లతో ఒక ఏడాదిలో నింపుతానని ఆయన హామీ ఇచ్చారు. అన్నిచెప్పాక ఆయన వూరిప్రజలను హరితహారంలో భాగస్వాములు కావాలని కోరారు.
తాను రాబోయే రెండేళ్ళ లో పచ్చని తెలంగాణ తయారుచేయాలనుకుంటున్నానని చెబుతూ, ’మీ కోరికలు అన్ని తీర్చిన. మరి నా కోరిక నెరవేర్చండి...అదేంటంటే సమైఖ్య రాష్ట్రం లో మనం నాశనం అయినము. ఉష్ణోగ్రతలు రోజు రోజు కు పెరుగుతున్నయ్. ఇక్కడ పద్దెనిమిది వేల మొక్కలున్నయంటున్నరు కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నయి. హరితహారం ను నిర్లక్ష్యం చేయొద్దు,’ అని అన్నారు. తర్వాత-
‘ప్రతి ఇంటికి ఆరు చెట్లు తప్పక పెంచాలి. మల్లీ నేను ఈ తోవ గుండా పోతే ఆ చెట్లు కనబడాలి.
ఇది సక్సెస్ చేస్తే కరెక్ట్ ఆరు నెలల్లో... ఆరు మొక్కలు బతికుంటే ఇంటికి రెండు పాడి పశువులను బహుమతిగా ఇస్తా.
లక్ష్మాపూర్ లక్ష్మి దేవి తాండడవించ్చే ఊరుగా ఉండాలని కోరుకుంటున్నాను,’ అని అన్నారు.