టిటిడి ఛెయిర్మన్ పదవి మీద కొనసాగుతున్న ఉత్కంఠ

Published : Aug 04, 2017, 05:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
టిటిడి ఛెయిర్మన్ పదవి మీద కొనసాగుతున్న ఉత్కంఠ

సారాంశం

నిన్నటి నుంచి ఛెయిర్మన్ పోస్టుకు వినపడుతున్న పేరు  సి.ఎం రవిశంకర్ ది. ఈ పేరు చెబితే ఆశ్చర్యపోని టిడిపి లీడర్ లేడు. ఆయనకు పార్టీకి ఏ సంబంధం లేదు. కాకపోతే, ఆయనకు ఒక స్వామీజీ సిఫార్సు ఉందట

టిటిడి ట్రస్టు బోర్డు ఛెయిర్మన్ నియమాకం మీద ఉత్కంఠ పెరుగుతూ ఉంది.

అధికారులేమో నియామకం పూర్తయింది జివొ విడుదలే అలశ్యం అంటున్నారు. దీనితో తెలుగుదేశం నాయకుల్లో కూడా తత్తరపాటు మొదలయింది.

నిన్నటి నుంచి ఛెయిర్మన్ పోస్టుకు వినపడుతున్న పేరు  సి.ఎం రవిశంకర్ ది(ఫోటో). ఈ పేరు చెబితే ఆశ్చర్యపోని టిడిపి లీడర్ లేడు. ఆయనకు పార్టీకి ఏ సంబంధం లేదు. కనీసం మదనపల్లి టిడిపిలో కూడా ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఇంత పెద్ద గౌరవం ఆయనకు ఇచ్చి ప్రయోజనేమిటనే వారు ఎక్కువ.అయితే, ఆయనకు ఉన్న అర్హత... ఆయన ఒక  స్వా మీజీకి బాగా దగ్గరి వాడని జిల్లా టిడిపి నాయకులు, మదనపల్లె ప్రముఖులు కొందరు చెప్పారు. మదన పల్లెలోనే ఉండే ఆయన గురువు చాలా మంది కేంద్ర మంత్రులకు కూడా సల హా ఇస్తుంటారట. ఇలా సలహాలు పొందిన వారిలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. రాజ్ నాధ్ సింగ్ చయడీ చప్పుడులేకుండా మదన పల్లె వచ్చిపోయాడట, రెండు మూడు సార్లు.

ఈ లెక్కన ఈ రవిశంకర్ ముఖ్యమంత్రి కి తప్పమరొకరెవరిక తెలియదు.

వృత్తి రీత్యా ఆయనొక కాంట్రాక్టరట.

ఆయన పేరు ను అధికార వర్గాలు తోసిపుచ్చడం లేదు.

ఇక బోర్డు సభ్యులుగా... ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధా నారాయణ  మూర్తి,

బోతు హరిప్రసాద్, భాను ప్రకాశ్ రెడ్డిలకు మరొక అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటాలో సత్యప్రభ పేరు వినబడుతూ ఉంది.

భవ్య సిమెంట్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ కూ ఈ పోస్టు కోసం లాబీయింగ్ చేస్తున్నారని తెలిసింది. 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !