రాహుల్ గాంధీ కాన్వాయిపై దాడి

Published : Aug 04, 2017, 05:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
రాహుల్ గాంధీ కాన్వాయిపై దాడి

సారాంశం

గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్ వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్

 

 

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్  గాంధీ కాన్వాయిపై పలువురు దాడికి దిగారు.వరద బాధితులను పరామర్శించేందుకు రాహుల్ గురువారం గుజరాత్ వెళ్లారు.అందులో భాగంగానే ఆయన ఈరోజు బనస్కంత అనే ప్రాంతానికి వెళ్లారు. కాగా.. ఆయన కారుపై పలువురు రాళ్లతో దాడి చేశారు. దాడి సమయంలో రాహుల్ కారులో లేరు. రాహుల్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ.. ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బంది గాయాలపాలైనట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.

కాగా.. ఈ దాడికి అసలు కారకులు భాజపా నేతలేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇది చాలా దారుణమైన దాడి అని.. ప్రతిపక్ష పార్టీ కదా ఏమి చేయలేదులే అని అనుకుంటున్నారేమో అని కాంగ్రెస్ నేత అభిషేక్  మను సింఘ్వి అన్నారు. కారు బాగా ధ్వంసమైందని.. అద్దాలు పగిలిపోయాయని ఆయన చెప్పారు.

దీనిపై భాజపా నేత కైలాష్ విజయ్ వర్గియా స్పందించారు. ఇది నిజంగా జరిగిన దాడో.. లేక కావాలని మీరే చేయించుకున్నారో అని భాజపా నేత కైలాష్  పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !