తొందర్లో మరొక చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించనున్న కెసిఆర్

Published : Sep 13, 2017, 10:01 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
తొందర్లో మరొక చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించనున్న కెసిఆర్

సారాంశం

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికి పెన్షన్ ప్రకటించేందుకు కెసిఆర్ కసరత్తు చేస్తున్నట్లు వినికిడి 2019 ఎన్నికల వ్యూహంలో భాగంగా ప్రకటన

తెలంగాణ లో మాజీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు పెన్షన్

 

2019 ఎన్నికల వ్యూహంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మాజీ సర్పంచ్,ఎంపిటిసి, జడ్ పిటిసి పట్టణాల్లో కౌన్సిలర్లుగా  పనిచేసిన వారందరికి పెన్షన్ ఇవ్వాలనుకున్నట్లు తెలసింది.

ఇవన్నీ చిన్న చిన్న పదవులే. వారంతా కూడా అల్పాదాయ వర్గాల వారే. దానికి తోడు తెలంగాణ ఉద్యమంలో శక్తవంచన లేకుండా వనిచేసిన వారే.  మరొకసారి గెల్వలేక,  ఉపాధిలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారు వారిలో చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకు మాజీ స్థానిక సంస్థల ప్రతినిధులు 50 వేల వరకు ఉండవచ్చునని అంచనా.

ఈ మధ్య వారి నుంచి పెన్షన్ డిమాండ్ వచ్చింది. ప్రజాతెలంగాణ నాయకుడు డాక్టర్ ఎం ఎఫ్ గోపీనాధ్ ఆ మధ్య  వారి తరఫున పెన్షన్ డిమాండ్ చేశారు.  పెన్షన్ ఆయన చేసిన వాదన‘‘ ఇప్పటి వరకూ పని చేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో 90 శాతం మంది ధనిక వర్గానికి చెందిన వారే. వీరిలో కేవలం 10 శాతం మందే పేదలుగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో పని చేసిన ప్రజా ప్రతినిధుల విషయానికొస్తే ఇందుకు పూర్తి భిన్నం. గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలుగా పని చేసిన వారిలో 90 శాతం మంది పేద కుటుంబీకులే. కేవలం 10 శాతం మంది మాత్రమే ధనిక వర్గానికి చెందిన వారు. అందుకే స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులకు పెన్షన్‌ ఇవ్వాలని పోరా డుతున్నాం. కోట్లకు పడగెత్తిన మాజీ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తుంది. పేదరికంలో కొట్టుమిట్టాడుతూ కూలీ పనులు చేసుకుంటూ శేష జీవితం గడుపు తున్న స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులను మాత్రం ఈ సర్కారు విస్మరిస్తోంది.’’

 

ఈ డిమాండ్ ఉపందుకున్నాక  పెన్షన్ ప్రకటిస్తే  ప్రభుత్వానికి క్రెడిట్ రాదు.  అందువల్ల ముందే పెన్షన్ ప్రకటించిముఖ్యమంత్రి తన ఉదారవైఖరిని చాటునుకునే అవకాశం ఉందని అధికార వర్గాలభోగట్టా.

సర్కారు సమర్థన, ఇపుడు తెలంగాణా యోధులకు పెన్షన్ అందిస్తున్నారు. ఈ తరం ఎలాగూకొద్ది రోజులలో అంతరిస్తుంది.అందువల్ల ప్రజాప్రతినిధులకు పెన్షన్ ప్రకటించడం లో పెద్ద సమస్యేమో ఉండదు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు  పెన్షన్ అవకాశంకల్పిస్తే గ్రామ స్థాయిలో ప్రభుత్వం, పార్టీ పట్టు పెరుగుతుందని కూడా ప్రభుత్వం భావిస్తన్నట్లు తెలుసింది. ఇప్పుడు పదవుల్లో ఉన్న వారు కూడా  ఈ నిర్ణయంతో  ఉత్సాహంగా పార్టీ కోసం బాగా పని చేస్తారు.  నెలసరి 4000 నుండి 5000 వరకు పెన్షన్ ఇచ్చేయోచన  ప్రభుత్వానికి ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది జూలై లో ఒక ఖమ్మంలో ఒక సమావేశం ఇప్పటికే జరిగింది. పెద్ద ఎత్తున కార్యాచరణకు పూనుకుంటున్నట్లు ఈ ఏర్పాట్లలో ఉన్న నాయకులొకరు ఏషియానెట్ కు తెలిపారు. అందువల్ల ముందే మేల్కొని నిర్ణయం ప్రకటించడంవల్ల మాజీ ప్రజాప్రతినిధులు సంతోషిస్తారు. ఉద్యమం రాకుండా మొగ్గలోనే తుంచేయవచ్చు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !