కెసిఆర్ కు అరుదైన అవార్డు

Published : Aug 19, 2017, 02:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
కెసిఆర్ కు అరుదైన అవార్డు

సారాంశం

కెసిఆర్ కు అగ్రికల్చర్ లీడర్ షిప్ 2017 అవార్డు

ఒక వైపు కాంగ్రెసోళ్లు ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు ద్రోహంచేస్తున్నాడని, ఎస్ ఎల్ బిసి మీటింగ్ కే రాడని అంటుంటూ,మరొక వైపు ఆయన వ్యవసాయ విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తూ ఉంది. ఈ సారి ఆయన వ్యవసాయానికి సంబంధించిన ఒక అరుదైన గౌరవం లభించింది. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్ -2017 అవార్డు లభించింది. పాలసీ లీడర్‌షిప్ కేటగిరీ కింద కేసీఆర్‌కు ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు కోసం సీఎం కేసీఆర్ పేరును ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతిపాదించింది. సెప్టెంబర్ 5న రాత్రి 7.30 గంటలకు న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో ఈ అవార్డును అందుకోనున్నారు కేసీఆర్. భారత ఆహార వ్యవసాయ మండలి ఈ అవార్డును అందజేయనుంది. లక్షలాది మంది వ్యవసాయదారుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు ఈ అవార్డు లభించిందని స్పష్టం చేసింది అవార్డు కమిటీ.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu