తెలంగాణ ఆర్టీసిలో మొదటి మహిళా డ్రైవర్

First Published Oct 5, 2017, 1:10 PM IST
Highlights

ప్రస్తుతం ఢిల్లీ ఆర్టీసిలో ఉన్న వర్క్యా సరితకు డ్రైవర్ ఉద్యోగం ఆఫర్ చేసిన టిఎస్ ఆర్టీసి

తెలంగాణ ఆర్టీసికి  మొదటి మహిళా డ్రైవర్ గా  చేరేందుకు భారత దేశపు మొదటి మహిళా డ్రైవర్ సరిత హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. సరిత ఇపుడు ఢిల్లీ ఆర్టీసిలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు.  అయితే, ఆమె టిఎస్ ఆర్టీసికి రావాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. ఇదే విధంగా మహిళా సాధికారీకరణ ను ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ ఆర్టీసి కూడా ఆమెకు ఉద్యోగమివ్వాలని నిర్ణయించింది. ఈ  విషయాన్ని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి  వెల్లడించారు. ఆమెకు ఉద్యోగం ఆఫర్ చేసినట్లు  ఆయన చెప్పారు. ఇక ఆమె ఈ ఆఫర్ ను అంగీకరించడాన్ని బట్టి ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, ఆమె హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే, ఈ ఏడాది మార్చిలోనే మంత్రిని కలసి తెలంగాణ ఆర్టీసిలో పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు.

వర్ క్యా సరిత వయసు 32 సంవత్సరాలు. తెలంగాణ యాదాద్రిజిల్లా జి సంస్థాన్ నారాయణ్ పూర్ ఆమె స్వస్థలం. మూడేళ్ల కిందట ఆమె ఢిల్లీ ఆర్టీసిలో డ్రైవర్ గా ఎంపికయి దేశంలోనే  ప్రభుత్వ రంగంలో మొదటి మహిళాడ్రయివర్ అయ్యారు. అంతకుముందు ఆమె క్యాబ్ డ్రయివర్ గా పనిచేశారు. ఆమె సేవలకు ఢిల్లీలో బాగా గుర్తింపు వచ్చింది. చాలా అవార్డులు, రివార్డులు అందుకున్నారు. కిరణ్ బేడీ ‘ఉమన్ అచీవర్స్ ’ అవార్డు కూడా అందించారు.

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి

https://goo.gl/dDD13Xhttps://goo.gl/dDD13X

click me!