కర్నాటక ముఖ్యమంత్రి ‘డబల్ యాక్షన్’

Published : Jun 22, 2017, 04:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
కర్నాటక ముఖ్యమంత్రి ‘డబల్ యాక్షన్’

సారాంశం

కర్నాటక ముఖ్యమంత్రి  సిద్ధరామయ్య నిజంగానే డబుల్ యాక్షన్ చేయబోతున్నాడు. నిజ జీవితంలోనే కాదు, ఆయన ఒక సినిమాలో కూడా చీఫ్ మినిస్టర్ గా నటించబోతున్నాడు.  సినిమాలోనటించేందుకు ఆయన అంగీకరించారు.  కన్నడంతో పాటు, ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమా రిలీజవుతుంది.

కర్నాటక ముఖ్యమంత్రి  సిద్ధరామయ్య నిజంగానే డబుల్ యాక్షన్ చేయబోతున్నాడు.

 

నిజజీవితంలోనే కాదు, ఆయన ఒక సినిమాలో కూడా చీఫ్ మినిస్టర్ గా నటించబోతున్నాడు.  సినిమాలోనటించేందుకు ఆయన అంగీకరించారు. కన్నడంతో పాటు, ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమా రిలీజవుతుంది.

 

సినిమాలో కూడా ముఖ్యమంత్రి పేరు సిద్ధరామయ్యే. సినిమాల్లో నటించనని మొదట మొదట మొండికేసిన సిద్ధరామయ్యను ప్రొడ్యూసర్ కవితా లంకేశ్ మొత్తానికి ఆయన ఒప్పించగలిగింది.సినిమా పేరు  ‘సమ్మర్ హాలిడేస్’.

 

నిన్ననే ఆయన కవితా లంకేశ్ కు అంగీకారం చెప్పారు. అయితే, కొన్ని షరతులు చూడా పెట్టారు. చిత్రంలో హింస, అశ్లీలత ఉండరాదనేది మొదటి షరతు. కథ నంతా వివరించిన తర్వాత ఆయన అంగీకరించారని కవిత మీడియాకు చెప్పారు. 

 

చిత్రం 80 శాతం పూర్తయిందని,ముఖ్యమంత్రి సమయమిస్తే, ఆయన పోర్షన్ షూట్ చేసి చిత్రం పూర్తి చేస్తామని ఆమె చెప్పారు. ఈ సినిమాలో కవిత లంకేష్ కూతురు ఈషా, మేనల్లుడు సమర్‌జీత్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఒకనాటి కన్నడ హీరోయిన్ సుమన్ నగర్ కార్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !