తిరుపతి, విశాఖల పక్కన నంద్యాలకు సీటేస్తారట

Published : Jun 22, 2017, 03:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
తిరుపతి, విశాఖల పక్కన నంద్యాలకు సీటేస్తారట

సారాంశం

అకస్మాత్తుగా తెలుగుదేశం ప్రభుత్వానికి నంద్యాల మీద ఏనలేని ప్రమే పట్టుకొచ్చింది. ఉప ఎన్నికల పుణ్యమా అని  నంద్యాలకు తిరుపతి, విశాఖల పక్కన సీటెస్తున్నారు. నంద్యాలను స్మార్ట్ సిటిగా మారుస్తామని ఉప ఎన్నికల బాధ్యుడు,మునిసిపల్ మంత్రి పి నారాయణ ఈ రోజు హామీ ఇచ్చారు.

నంద్యాల అసెంబ్లీనియోజకవర్గానికి  ఉప ఎన్నిక తప్పని సరి కావడంతో తెలుగుదేశం ప్రభుత్వం లో గుబులు ఎక్కువయిందనిపిస్తున్నది. అందుకే చిత్రమయిన హమీలను ఇవ్వబోతున్నది. మూడేళ్ల తర్వాత ఇపుడు నంద్యాల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో...

ఈ రోజు నంద్యాల నియోజవర్గంలోటిడిపి గెలుపును భజానేసుకున్న మునిసిపల్ మంత్రి ఏమన్నాడో తెలుసా... నంద్యాల పట్టణానికి  విశాఖ, తిరుపతిల పక్కన సీటేస్తామన్నారు.

ఇంతవరకు కనీసం చర్చల్లో కూడా నలగని అమాయకపు నంద్యాలను ఇపుడు  స్మార్ట్ సిటీగా తయారుచేస్తామని హామీ ఇచ్చారు. 

ఆ విషయం స్మార్ట్ సిటి ప్రతిపాదనలు పంపిస్తున్నపుడు రాలేదా? కొత్త విద్యాసంస్థలను, వైద్య సంస్థలను ప్రకటిస్తున్నపుడు విశాఖ తిరుపతి తప్ప మరొక సిటి గురించి ఆలోచించారా?అపుడు నంద్యాల గుర్తు రాలేదా?

ఈ రోజు కర్నులులో నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి గురించి మంత్రి నారాయణ సమీక్ష చేశారు. అక్కడ ఆయన  చెప్పిన మాటలు:

* ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 1100 కోట్ల పనులు నియోజకవర్గంలో చేపడుతున్నాం.

* పట్టణంలో అన్ని రోడ్లను విస్తరించి సుందరంగా తీర్చిదిద్దే పనులు వెంటనే చేపడుతున్నాం.

* దేశంలో ఎక్కడాలేనంత నాణ్యతతో  పేదల ఇళ్ళు ఇక్కడ నిర్మిస్తున్నాం

* ఒక్కో ఇంటికి లక్ష చొప్పున  మౌలికసదుపాయాల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది .

* ఇలాంటి 13000 ఇళ్ళను నంద్యాలలో పేదల కోసం నిర్మిస్తున్నాం.

ఇదీ సంగతి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu