ఆంధ్రప్రదేశ్ వార్తలు మధ్యాహ్నం రౌండప్

First Published Jun 22, 2017, 1:44 PM IST
Highlights

మంగళగిరి లోని రాజన్న క్యాంటీన్ కు వచ్చి ఎమ్మెల్యే ఆళ్ల. రామకృష్ణా రెడ్డి గారి అమ్మ   ఆళ్ల. వీరరాఘవమ్మ (పెదకాకాని సర్పంచ్) రూ. 4 భోజనం చేశారు. ఈ మధ్యే ఈపథకం ప్రారంభమయిన సంగతి తెలిసిందే.భోజనం చాలా రుచికరంగా వుందని ఆమె ప్రశంసించారు.

 

మంగళగిరి లోని రాజన్న క్యాంటీన్ కు వచ్చి ఎమ్మెల్యే ఆళ్ల. రామకృష్ణా రెడ్డి గారి అమ్మ   ఆళ్ల. వీరరాఘవమ్మ (పెదకాకాని సర్పంచ్) రూ. 4 భోజనం చేశారు. ఈ మధ్యే ఈపథకం ప్రారంభమయిన సంగతి తెలిసిందే.భోజనం చాలా రుచికరంగా వుందని ఆమె ప్రశంసించారు. .ఇలా 4 రూపాయలకే మంచి భోజనం అందిస్తూన తన కొడుకు పేదలకు సహాయపడుతుండడం చాలా సంతోషంగా వుందని  ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

***

ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాల గ్రామీణ తెదేపా కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.  గత ఎన్నికల్లో రాజీ పడాల్సి వచ్చిందని, దానివల్ల పార్టీకి నష్టం జరిగిందని, ఈసారి పార్టీకి గెలిచే నాయకులు కావాలని ఆయన అన్నారు.ఓటుకు డబ్బు ఇచ్చే సంస్కృతిని అవలంబించాల్సిన అవసరం లేదు, గతంలో లేనివిధంగా మూడేళ్లలో జరిగిన రాష్ట్రాభివృద్ధిని చూసి ప్రజలే ఓట్లు వేస్తారన్నారు. రాయలసీమకు సుపరిపాలనఅందిస్తామని హామీ ఇచ్చారు.  

***

 

అమరావతి :పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను కృష్ణా జలాల్లోకి నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ విడుదల చేశారు. న్యూజివీడు మండలం పల్లెర్లమూడి వద్ద కృష్ణాలోకి గోదావరి నీళ్లు ప్రవేశించాయి.  

***

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంస్థ ఛెయిర్మన్ పదవి నుంచి  ఐవైఆర్‌ కృష్ణా రావు  తొలగింపు నిర్ణయం సరైనదేనని ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఐవైఆర్‌ కృష్ణారావు వేరే పార్టీల అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆయన విమర్శించారు.  ఐవైఆర్‌ ఏదో పార్టీలో చేరాలన్న ఆలోచనలో ఉన్నారని ఆయన అన్నారు. అంతేకాదు, ప్రకాశం జిల్లా దొనకొండలో ఐవైఆర్ బినాబీ పేర్లతో వంద ఎకరాల భూమి కూడా కొన్నారని ఆయన అరోపించారు.రాజధాని ఏర్పాటును కూడా ఐవైఆర్ అడ్డుకోబోయారని తెలిపారు. రాజాధానిని దొనకొండకు తరలించేందుకు ప్రయత్నించారని కూడా అన్నారు.. దొనకొండలో రాజధాని పెట్టాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశారని, తానే ఈ విషయాన్ని సీఎం దృష్టి కి తీసుకెళ్ళానని రాయపాటి  అన్నారు.    

 

***                   

రేణిగుంట: రేణిగుంట విమానాశ్రయంలో భారీ జాతీయ జెండా ఏర్పాటుకు అధికారులు బుధవారం సన్నాహాలు చేపట్టారు. విమానాశ్రయం ఎదుట వంద అడుగుల ఎత్తు స్తంభంపై, 30 అడుగుల వెడల్పుతో జాతీయ జెండాను గురువారం సీఎం చంద్రబాబు ఎగరేశారు. 

***

                     
 విజయవాడ: రాజకీయలబ్థి కోసమే విశాఖలో వైసీపీ ధర్నా నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం కేఈ క‌ృష్ణమూర్తి అన్నారు. కిరాయి మనుషులను తీసుకువచ్చి మహాధర్నా పేరుతో డ్రామాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ భూఆక్రమణలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని తెలిపారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందన్నారు. 11కేసుల్లో ముద్దాయిగా ఉన్న వాళ్లా ప్రజలకు మేలు చేసేది? అని ప్రశ్నించారు. గతంలో సిబిఐ విచారణకు రాజకీయ రంగుపులిమిన ప్రతిపక్షనేత సీబీఐ విచారణ కోరడం విడ్డూరంగా ఉందని అన్నారు.  

 

***                     

విశాఖ :ఫార్మాసిటీ పరిసరాల్లో చిరుతసంచారం కలకలం రేపుతోంది. స్థానికంగా ఒక చిరుత తిరుగుతోందని వార్తలు వెలువడటంతో అక్కడి ప్రజలు భయాందోళనలతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి చిరుత వస్తుందో తెలియక ప్రజలు అయోమయస్థితిలో ఉన్నారు. అటవీశాఖ అధికారులు వచ్చి చిరుత జాడ కనిపెట్టాలని వేడుకుంటున్నారు.

                       
 

 

click me!