హక్కుల కమిషన్ చేరుకున్న ‘వంగవీటి’ గొడవ

First Published Dec 24, 2016, 12:29 PM IST
Highlights

'వంగవీటి ' సినిమా మీద కాపుల అభ్యంతరం. కొన్ని సీన్లు తొలగించాలని హెచ్చరిక

సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ రూపోందించిన  ‘వంగవీటి’ చిత్రంలో కొన్ని దృశ్యాలకు అసంతృప్తి చెందిన కాపు వర్గానికి  వ్యక్తులు వీటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

 

 పేరు ‘వంగవీటి’... చితీకరణ మొత్తం ఆయన ప్రత్యర్థి నెహ్రూ వైపు మొగ్గిందనేది రంగా అభిమానుల విమర్శ.

 

దీనిని అంగీకరించలేక   వంగవీటి రంగ అభిమానుల సంఘం శనివారం నాడు  ఏకంగా మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది.

 

దశుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రంలో ఒక వ‌ర్గాన్ని రౌడీ మూకలుగా  చిత్రీక‌రించార‌ని  వారు ఆరోపిస్తున్నరు.  దర్శకుడు వ‌ర్మ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శ‌నివారం వారు మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.

 

అభ్యంతరకరమయిన స‌న్నివేశాల‌ను తొల‌గించ‌క‌పోతే సినిమా ని ఆడనీయమని,  అడ్డుకుంటామ‌ని వారు హెచ్చరించారు.

 

ఈ ఫిర్యాదుపై స్వీకరించిన మానవ హక్కుల సంఘం జనవరి 16లోగా ఈ వ్యవహారంపై ఒక  నివేదిక సమర్పించాలని సెన్సార్‌ బోర్డును ఆదేశించింది.

 

click me!