క్యాష్ లెస్ అంటే ... పూజారికి దక్షిణ ఎట్లా?

Published : Dec 24, 2016, 10:20 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
క్యాష్ లెస్ అంటే ... పూజారికి దక్షిణ ఎట్లా?

సారాంశం

మోదీ క్యాష్ లెస్ కాలం వస్తే వేల కొలది పూజారులు చిన్నపాటి రాబడి కోల్పోతారు. చాలా గుళ్లలో వారికి దక్షిణే జీవనాధారం.

క్యాష్ లెస్  వ్యవస్థ వస్తే... పూజారి హారతి పళ్లెం ఖాళీయే...

 

పూజారి కోసం హారతి పళ్లెంలో  దక్షిణ వేయడం హిందూ సంప్రదాయం. దేవాలయాలు ఎండోమెంట్స్ వారి పరిపానల వెళ్లాక, ’పూజారికి దక్షిణ వేయకండి. దక్షిణ హుండీలోనే వేయాలి‘ అని బోర్డులు తగిలించినా హారతి పళ్లెంలో ఉదారంగా దక్షిణ వేసి  భక్తులు  పూజారి మెప్పు పొందుతూ ఉంటారు.

 

దక్షిణ వేసే భక్తులకు ప్రత్యేక అశీస్సులు దొరకడం, పూజారి కంటపడేందుకు  పెద్ద నోటును దక్షిణ  గా ఇవ్వడం జరుగుతూ ఉంటుందప్పుడప్పుడు. దీని  వల్ల దక్షిణ కొంత అపకీర్తి పాలయ్యింది. దక్షిణ లంచానికి  మారుపేరుగా మారిందిక్కడే. అయినా  భక్తునికి, పూజారిని  అనుసంధానంచేసింది దక్షిణయే. చాలా గుళ్లలో  పూజారులు కేవలం దక్షిణ మీదే అధారపడి జీవిస్తూ  ఉంటారు. భక్తుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

 

 దక్షిణ ఎపుడూ నగదు రూపంలో నే ఉంటుంది. భక్తులు చెక్కును , ప్రామిసరీ నోట్ల రూపంలో దక్షిణ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి మోదీచెప్పినట్లు, మన ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబు తలూపినట్లు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ అంటే...పూజారుల దక్షిణ ఎట్లా?

 

“ ఈ చర్య తరతరాలు గా వస్తున్నఒకహిందూ సంత్సంప్రదాయానికి ముప్పుగా తయారయింది,” అని అఖిల భారత పూజారులు సమాఖ్య అధ్యక్షడు నరేంద్రగిరి అంటున్నారు.

 

“ సంప్రదాయం ప్రకారం పూజారులకు లేదా సాధువులను, సన్యాసులకు భోజనం పెట్టినపుడు దక్షిణ ఇవ్వడం ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని అంతం చేయాలనుకుంటే, మోదీ ఆయన క్యాష్ లెస్ ను తప్పనిసరి చేయవచ్చు. చేయాలనుకుంటున్నాడా? దేశంలో ఎవరూ సాధువులు,పూజారులు, సన్యాసులు జీవించరాదని అనుకుంటున్నారా,” అని ఆయన అడుగుతున్నారు.

 

ఇక హుండీల సంగతి కొస్తే, హుండీలో వేసేదక్షిణ గోప్యంగా ఉంచుతారు.  చిన్న, పెద్ద మొత్తం అనేది లేకుండా గుట్టుగా తమ శక్తి మేరా హుండీలో వేస్తుంటారు.  క్యాష్ లెస్ అంటే చాలా దేవాలయాలో హారతి పళ్లాలే కాదు,  హుండీల అవసరం తీరిపోతుంది. ఉన్నా ఖాళీ గా బోసిపోవలసిందేనేమో... ఇది పూజార్ల భృతి మీద పెద్ద  బాగా దెబ్బతీస్తుంది. లేదంటే, పూజారి నడుం  కొక స్వైపింగ్  మిషన్ తగిలించుకుని ఉండాల్సిందే... అయితే, హారతి పట్టేపుడు ఈ మిషన్ వాడటమెట్లా?

 

సైపింగ్ మిషన్ల ద్వారా పేద భక్తులు చిన్న చిన్న మొత్తాలను ట్రాన్స్ ఫర్ చేసుందుకు ఇబ్బంది పడతారు.

 

మొత్తానికి పూజర్ల ఆదాయానికి , గుళ్ల ఆదాయానికి   క్యాష్ లెస్ గడ్డుకాలం తెచ్చేలా ఉంది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !