అయ్యప్ప సన్నిధిలో మంత్రి కామినేని అపచారం

First Published Jun 26, 2017, 4:45 PM IST
Highlights

అయ్యప్ప సన్నిధిలో అపచారానికి పాల్పడ్డ ఆంధ్రా మంత్రి కామినేని శ్రీనివాస్. ఆయన చెప్పులేసుకునే దీక్షలో ఉన్నారు. చెప్పులతోటే స్వామి వారిని దర్శించారు. ఇది ఆలస్యంగా బయటపడినా, దూమారం లేపుతూ ఉంది.

ఆంధ్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  కామినేని శ్రీనివాస్ విఐపి. రాష్ట్రంలో విఐపిలకు అన్ని చోట్లా మినహాయింపులుంటాయి. ఏమిచేసినా గవర్నమెంట్ కవచం కాపాడుతుంది. ఇదే విధానాన్ని మంత్రిగారు అయప్ప సన్నిధికి కూడా తీసుకెళ్లారు. తాను మంత్రిని కదా ఏమవుతుంది, ఏమి చేస్తే అది కరెక్టనుకున్నట్లుంది. ఏకంగా చెప్పలేసుకునే స్వామి దర్శనానికి వచ్చారు. ఇది వివాదాస్పదమయింది. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంది. నడిచే వోపిక లేక ఆయన డోలీ లో వచ్చారు. ఈ మేరకు అందరికీ మినహాయింపు ఉంది. ఆరెండో దే ఎవరికీ నచ్చలేదు. డోలీ ఎక్కేటపుడు ఆ చెప్పులు తీసేయాలన్న ఆలోచన లేకుండాపోయింది. అధికార దర్పం అడ్డొచ్చిందేమో. సాధారణంగాదైవ దర్శనానికి వెళ్లినా చెప్పలుండవు. అయ్యప్ప స్వామి విషయంలో నియమాలు కఠినంగా ఉంటాయి. భక్తులు వాటిని తుచ తప్పక పాటిస్తారు.  అయితే,  భక్తుల మనోభావాలను పట్టించుకన్నట్లే లేరు. చెప్పులతోనే ఇలా కనిపించారు.

ఈ మధ్య కొంత మంది మంత్రులతో కలసి ఆయన మాల వేసుకున్నారు. మొక్కుబడితో శబరిమళ  సందర్శించారు. అపుడుజరిగిన అపచారమిది.

click me!