కంభంపాటి రాజీనామా

First Published Apr 17, 2018, 10:23 AM IST
Highlights
ఇటీవల తమతో తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు పంపించారు. పార్టీ పదవుల్లో యువకులకు ప్రాధాన్యం కల్పించాలన్న ఉద్దేశంతోనే తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. హరిబాబు గత నాలుగేళ్లుగా ఏపీ భాజపా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల తమతో తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో స్వతహాగా బలం పుంజుకోవాలని భాజపా యోచిస్తోంది. దీనిలో భాగంగానే పార్టీ అధ్యక్షుడిగా హరిబాబును తప్పించి సమర్థుడైన మరో నేతకు కట్టబెట్టాలని అధిష్ఠానం ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిలో ప్రముఖంగా మాజీమంత్రి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొత్త అధ్యక్షుడి నియామకానికి మార్గం సుగమం చేసేందుకే హరిబాబు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

click me!