ఏప్రిల్ 17, 2018 మంగళవారం మీ రాశిఫలాలు

Published : Apr 17, 2018, 09:27 AM IST
ఏప్రిల్ 17, 2018 మంగళవారం మీ రాశిఫలాలు

సారాంశం

శుభ వార్త వింటారు

మేషం

మేషం : చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరుగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది.

వృషభం

వృషభం : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మిథునం

మిథునం : ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధ మైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీకు ఆనందంగా, లాభదాయకంగా ఉం టుంది. అనుకోని మిత్రులను కలవటం, వారితో ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

సింహం

సింహం : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయి దా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగవిషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. గతంలో చేసిన అప్పులు తీరుస్తారు.

కన్య

కన్య : ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయం లో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వలన ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది.

తుల

తుల : మీ సహోద్యోగులతో, పై అధికారులతో సామరస్య పూర్వకంగా ప్రవర్తించటం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారి తో గొడవ జరిగే అవకాశముంది. ప్రయాణంలో అనవసరమై చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంంది కాబట్టి జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, గృహ ఒప్పందాలకు అనువైన రోజు కాదు.

వృశ్చికం

వృశ్చికం : దాంపత్యజీవితం ఆనందమయంగా ఉంటుంది. వివాదాలు సమసిపోతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వి నోదాల్లో కానీ, శుభకార్యాల్లో కానీ పాల్గొంటారు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడం కానీ, నూతన వ్యాపార ఒప్పందాలు ఏర్పరచుకోవటం కానీ చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వాయిదా పడుతున్న పనులు ఎలాగైనా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉంటారు. అదే పట్టుదలతో వాటిని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ మాట నెగ్గుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు.

మకరం

మకరం : ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అందిన డబ్బు క్షణాల్లో ఖర్చవుతుంది. ఇతరుల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు . అలాగే మీ సంతానం కారణంగా లేదా మీ స్నేహితుల కారణంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది.

కుంభం

కుంభం : ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఏ పని కూడా శ్రమలేకుండా పూర్తి కాదు. ఆర్థికంగా సామాన్యంగా ఉం టుంది. అనుకోని ఖర్చులు చేయాల్సి వస్తుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కోపానికి, అసహనానికి గురవకుండా ఓపికగా పనులు చేయటం మంచిది. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

మీనం

మీనం : ఆర్థికంగా చాలా అనుకూలించే రోజు. ఉద్యోగంలో రావలసిన బకాయిలు రావటం కానీ, జీతం పెరగటం కాని జరుగుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేస్తారు. నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. మీ బంధువులను కలుసుకుంటారు. ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ కి సంబంధించిన పనులు ఒక కొలిక్కి వస్తాయి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu