జగన్ మాష్టర్ ప్లాన్... ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు

First Published Apr 17, 2018, 9:49 AM IST
Highlights
త్వరలోనే వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా

ఒక వైపు పాదయాత్రతో ప్రజల మద్దతు పొందుతున్న జగన్.. వచ్చే ఎన్నికల లక్ష్యంగా మరో మాష్టర్ ప్లాన్ వేశారు. ప్రత్యేక హోదా అంశంపై టిడిపిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు వైసీపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి హోదా డిమాండ్ చేస్తూ
వైసీపీ లు తమ రాజీనామాలను లోక్ సభ స్పీకర్ కి అందజేసిన సంగతి తెలిసిందే. కాగా.. మరి కొద్దిరోజుల్లో ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తే రాజకీయంగా టిడిపిపై తీవ్రమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. అంతేకాదు రాజకీయంగా టిడిపి మీద పైచేయి సాధించే అవకాశం ఉందని కూడ వైసీపీ నేతలు భావిస్తున్నారు. సాధారణంగా ఏదైనా నియోజకవర్గ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే.. ఆ నియోజకవర్గాన్ని ఉప ఎన్నిక నిర్వహిస్తారు.
అయితే.. 2019 ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. 2018 నవంబర్ నుంచి 2019 ఏప్రిల్ లోపు ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలు మొదలు కావడానికి కనీసం సంవత్సరం గడువు ఉంటేనే ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. కాగా.. వైసీపీ ఎమ్మెల్యేలు జూన్ లో రాజీనామాలు చేయనున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. అంటే.. ఎన్నికలు మొదలవ్వడానికి 5నెలల ముందు వారు రాజీనామాలు చేయనున్నారు. దీంతో.. ఎన్నికల కమిషన్ నియమాల ప్రకారం ఉప ఎన్నికలు ఉండవు.

అయితే.. దీని వల్ల వైసీపీకి నష్టం ఏమీ ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హోదా కోసం రాజీనామాలు చేసిన కీర్తి దక్కుతుందని జగన్ భావిస్తున్నారు. దీని వల్ల ప్రజల నుంచి అభిమానాన్ని పూర్తి స్థాయిలో సంపాదించి.. వచ్చే ఎన్నికల్లో సీఎం కుర్చీ దక్కించేందుకు జగన్ పక్కాగా వ్యూహం రచించారు. అంతేకాకుండా.. ఈ రాజీనామాలతో
 చంద్రబాబుని ఉక్కిరి బిక్కిరి చేసి.. హొదా కోసం పోరాడిన ఘనత జగన్ చేజిక్కించుకోనున్నారు. మరి జగన్ ఈ మాష్టర్ ప్లాన్ ని చంద్రబాబు ఎలా తట్టుకుంటారో చూడాలి.


 

click me!