(వీడియో) స్టీల్ ప్లాంట్ పై మహానాడు మౌనం: కడపలో ఆగ్రహం

First Published Jun 1, 2017, 12:18 PM IST
Highlights

కడప జిల్లా తెలుగుదేశం ఇన్ చార్జ్ మంత్రి సోమిరెడ్డి  చంద్రమోహన్ రెడ్డి మీద జిల్లాలో వ్యతిరేకత మొదలయింది.  వైజాగ్ మహానాడులో కడప జిల్లా స్టీల్ ప్లాంట్ మీద ఒక తీర్మానం చేయించలేకపోవడంతో  ప్రజలు అగ్రహంతో ఉన్నారు. మినీ మహానాడులో ఆయనచెప్పిన వన్నీ  ఉత్త గొప్పలే నని  వైజాగ్ మహానాడులో  అవి బుట్టుదాఖలా కావడంతో రుజువయ్యాయని అంటున్నారు. ఆయన జిల్లాకు ఇన్ చార్జ్ మంత్రిగా పనికి రాడని   స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.

కడప జిల్లా తెలుగుదేశం ఇన్ చార్జ్ మంత్రి సోమిరెడ్డి  చంద్రమోహన్ రెడ్డి మీద జిల్లాలో వ్యతిరేకత మొదలయింది.  వైజాగ్ మహానాడులో కడప జిల్లా స్టీల్ ప్లాంట్ మీద ఒక తీర్మానం చేయించేలేకపోవడంతో  ప్రజలు అగ్రహంతో ఉన్నారు.మినీ మహానాడులో ఆయనచెప్పిన గొప్పలు వైజాగ్ మహానాడులో బుట్టుదాఖలా కావడంతో ఆయన జిల్లాకు ఇన్ చార్జ్ మంత్రిగా పనికి రాడని చెబుతున్నారు.

 

ఇదే విధంగా జిల్లాకు చెందిన మంత్రి సి ఆదినారాయణ రెడ్డి మీద  ఇదే వ్యతిరేకత చూపుతున్నారు.  

 

ఇద్దరు మంత్రులున్నా , జిల్లాకు అయువుపట్టులాంటి ఉక్కు ఫ్యాక్టరీ  సమస్యమీద మహానాడులో ప్రస్తావన కూడా చేయించలేకపోయారని ప్రజలు గ్రహించారు. ఎందుకంటే, గత రెండేళ్లుగా నిరంతరాయంగా సీమ ఉక్కు, కడప హక్కు నినాదంతో ప్రజలు,విద్యార్థులు యువకులు ఉద్యమం చేస్తూనే ఉన్నారు.  ఈ విషయం ఆదినారాయణరెడ్డికి బాగా తెలుసు.

 

కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ కోసం కృషి చేయడం అనేది తెలుగుదేశం పార్టీ విధానమని చెప్పేందుకు మహానాడులో  ఒక తీర్మానం చేసి ఉండాల్సి ఉండింది. తీర్మానం చేసి ఉంటే, ఉక్కు ఫ్యాక్టరీకి తెలుగుదేశానికి కమిట్  అయిందని ప్రజలను కునే వారు. అలా జరగకపోవడం తెలుగుదేశం అజండాలో కడప స్టీల్ ప్లాంట్  లేదని ప్రజలు అనుమానిస్తున్నారు.

 

వైజాగ్ మహానాడులో కడపస్టీల్ ప్లాంట్  ప్రస్తావన లేకపోవడానికి స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు జి. ప్రవీణ్ రెడ్డి ఆక్షేపణ తెలిపారు. తాను పార్టీ మారేదే ఈ ప్రాంత అభివృద్ధి కోసమని వైసిపి నుంచి టిడిపిలోకి వెళ్తున్నపుడు ఆదినారాయణ రెడ్డి చేసిన ప్రకటనను ప్రవీణ్ గుర్తు చేశారు.ఈ ప్రకటన  బూటకమేనా అని ఆయన అడుగుతున్నారు.

 

మే 21 వ తేదీన కడప మిని మహానాడులో  స్టీల్ ప్లాంట్ గురించి చేసిన తీర్మానం గుర్తుచేస్తూ మహానాడులో ఇది బుట్టదాఖలా కావడమేమిటని ఆయన ప్రశ్నించారు.

 

ఇది సీమ వాసులను మోసం చేయడమేనని ప్రవీణ్ విమర్శించారు. ఈస్టీల్ ప్లాంట్ వచ్చేది సొంతనియోజకవర్గం జమ్మలమడుగులోనే నయినా ఆదినారాయణ రెడ్డి  దీనిని గురించి మాట్లాడకపోవడంతో, ఆయన పార్టీ మారిన అజండా అభివృద్ధికాదని, ఏదో సొంత గొడవ అని ఆయన అన్నారు. మహానాడులో 28 తీర్మానాలు చేస్తే రాయలసీమకు సంబంధించినవి కేవలం మూడేనని, అందులో కీలకమయిన స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేనే లేదని  ఉపాధ్యక్షుడు అమర్ నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఖలందర్ వ్యాఖ్యానించారు. ఇన్ చార్జ్ మంత్రిగా సోమిరెడ్డి పనికిరాడని, ఆయనను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

click me!