జ‌స్టీన్ బీబ‌ర్ కారు త‌గిలి సృహా కోల్పోయిన‌ ఫోటోగ్రాఫ‌ర్

Published : Jul 29, 2017, 05:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
జ‌స్టీన్ బీబ‌ర్ కారు త‌గిలి సృహా కోల్పోయిన‌ ఫోటోగ్రాఫ‌ర్

సారాంశం

బీబర్ కారు తగిలి కింద పడిపోయినా ఫోటోగ్రాఫర్. కిందకి దిగి తన పరిస్థితి చూసిన బీబర్ తన కారులో హాస్పిటల్ కి పంపించాడు.

జస్టీన్‌ బీబ‌ర్ కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. బీబ‌ర్ తో ఫోటోలు దిగాల‌ని, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవాల‌ని, త‌న‌ వెంట ప‌డుతుంటారు. ఇక మీడియా అయితే చెప్ప‌న‌క్క‌ర్లేదు, ఎక్క‌డ బీబ‌ర్ క‌నిపించిన త‌మ‌ కెమెరాలలో బంది చేయ్య‌డానికి వంద‌లాది మంది ప్ర‌య‌త్నిస్తుంటారు.


అయితే బీబ‌ర్ లాస్ ఎంజెల్స్ లో ఒక చ‌ర్చ్‌కి వెళ్లీ తిరుగు ప్ర‌యాణం అయాడు. అప్పుడు చ‌ర్చీ ముందు వందల కెమేరాలు ఉన్నాయి. ఆయ‌న చ‌ర్చీ నుండి బ‌య‌టికి వ‌స్తుండ‌గా వేలాది మంది మీడియా వాళ్లు త‌న‌ ఫోటోలు తీయ్య‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అంద‌రు ఫోటోగ్రాఫర్లు బీబ‌ర్ కారుకి ఎదురు వెళ్ల‌డంతో ఎంత హార‌న్ కొట్టిన ఎవ్వ‌రు క‌ద‌ల‌డం లేదు. జ‌స్టీన్ బీబ‌ర్ డ్రైవ‌ర్ ఎంత ప్ర‌య‌త్నించిన బ‌య‌ట ప‌డ‌లేక పోవ‌డంతో కారును నెమ్మ‌దిగా ముందుకు క‌దిలించాడు. 

  
అప్పుడు 57 సంవ‌త్స‌రాల ఫోటోగ్రాఫ‌ర్ కి బీబ‌ర్ కారు తాకింది, దీంతో  ఆ ఫోటోగ్రాఫ‌ర్ అక్క‌డిక్క‌డే కింద ప‌డిపోయ్యాడు. త‌న శ‌రీరానికి బాగా గాయాలు అవ్వ‌డంతో సృహా కోల్పోయాడు. అది తెలుసుకున్న జ‌స్టీన్ బీబ‌ర్ కారు దిగి ఫోటోగ్రాఫ‌ర్ ద‌గ్గ‌ర‌కి వెళ్లీ ప‌రిస్థితి తెలుసుకున్నాడు. త‌న‌కి బాగా రక్తం కొల్పోవ‌డంతో త‌న‌తో ఉన్న మ‌రో కారులోకి ఎక్కించి హాస్ప‌ట‌ల్ కి పంపించాడు.

ఇది చూసిన ఫ్యాన్స్‌ జ‌స్టీన్ బీబ‌ర్ ద‌యాహృద‌యానికి ట్వీట్ట‌ర్‌లో వేలాది ట్వీట్స్ పెట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !