
టోల్ ప్లాజా వద్ద గంటలు గంటలు నిరిక్షించే రోజులు పోనున్నాయి. ఎమర్జేన్సీగా ప్రయాణిస్తుంటే అందరికి బాగా ఇబ్బంది పెట్టే విషయం టోల్ ప్లాజా వద్ద క్యూలో ఆగి ఉండటం. ఒకటి రెండు ప్రాంతాలలో కాదు, దాదాపుగా చాలా ప్రాంతాలలో ఈ విషయంపై వాహానచోదకులు బాగా ఇబ్బంది పడుతున్నారు. దేశంలో చాలా రోజుల నుండి ఒక నిబంధన పెండింగ్ లో ఉంది. టోల్ ప్లాజా వద్ద నిరీక్షణ కి సంబంధించిన ఫైలు, ఎక్కువ సమయం టోల్ ప్లాజా వద్ద ఉండాల్సి వస్తే ఫ్రీగా పంపించాలి అనేది.
మూడు నిమిషాలు దాటితే..
మీరు టోల్ ప్లాజాకు చేరి మూడు నిమిషాల వరకు వాళ్లు మిమ్మల్ని పైకం తీసుకోకుండా, అలాగే మీరు నిరిక్షిస్తూ ఉంటే, మీరు ఒక్క పైసా కూడా టోల్ కట్టాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని భారత జాతీయ రహాధారి సంస్థ ప్రకటించింది. ఇప్పటిక వరకు కేవలం కొన్ని టోల్ ప్లాజాల వద్ద మాత్రమే ఈ నిబంధన వర్తించేది. కానీ నేటి నుండి దేశంలో ఉన్న అన్ని టోల్ ప్లాజాలకు ఈ మూడు నిమిషాల నిబంధన వర్తిస్తుందని తెలిపింది.
మూడు నిమిషాల కన్న ఎక్కువ సమయం మీరు టోల్ ప్లాజా వద్ద నిరీక్షణ చేయాల్సి వస్తే, ఫ్రీగా వెళ్లోచ్చు. ఒక వేల అధికారులు అడ్డుకుంటే మీరు దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ కి కంప్లైంట్ చేయ్యవచ్చని కూడా తెలిపింది.