బిహార్ లో ఆర్జేడీ నేత దారుణ హత్య

Published : Jul 29, 2017, 04:42 PM ISTUpdated : Mar 24, 2018, 12:03 PM IST
బిహార్ లో ఆర్జేడీ నేత దారుణ హత్య

సారాంశం

ఆర్జేడీ నేత మిన్హాజ్ ఖాన్ దారుణ హత్య నిద్రిస్తుండగా కాల్పులు

 

 

బిహార్ లో  రాష్ట్రీయ జనతా దల్( ఆర్జేడీ) నేత మిన్హాజ్ ఖాన్ దారుణ హత్యకు గురయ్యారు. షేక్ పుర గ్రామంలోని తన నివాసంలో మిన్హాజ్ ఖాన్ నిద్రిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపినట్లు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ సంజిత్ కుమార్ తెలిపారు.

 ఆయన శరీరంలోని ఐదు బులెట్లు దూసుకుపోయినట్లు పోలీసులు చెప్పారు. ఖాన్ కి ఆ ప్రాంతంలో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందని.. సోషల్ మీడియాలో ఆయనను అనుసరించే వారు 5వేల మంది వరకు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పారు.

మిన్హాజ్ ఖాన్ ఆర్జేడీ యువ మోర్జాకి జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేశారు. వివాదాస్పద బిహార్ మాజీ ఎంపీ మహ్మద్ షహదుద్దీన్ తో ఖాన్ ఎంతో సన్నిహితంగా వ్యవహరించేవాడు. షహదుద్దీన్ ప్రస్తుతం ఓ క్రిమినల్ కేసు లో జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !