జస్టిస్ కర్నన్ అరెస్టును తప్పించుకోలేక పోయాడు

First Published Jun 21, 2017, 9:12 AM IST
Highlights

సుప్రీం కోర్టుతో తగవుపెట్టుకుని తప్పించుకు తిరుగుతున్న కోల్ కతా హైకోర్టు మాజీ జడ్జి  కర్ణన్ ని మొత్తానికి పోలీసులు పట్టుకున్నారు. చరిత్రలో అరెస్టుకు భయపడి తప్పించుకు తిరిగిన న్యాయమూర్తి  ఈయనేమో.

సుప్రీం కోర్టుతో తగవుపెట్టుకుని తప్పించుకు తిరుగుతన్న కోల్ కతా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ కర్ణన్ ని మొత్తానికి పోలీసులు పట్టుకున్నారు. చరిత్రలో అరెస్టుకు భయపడి తప్పించుకుతిరిగిన న్యాయమూర్తి  ఈయనేమో.

 

కోయంబత్తూరులో ఆయనని  పశ్చిమబెంగాల్  పోలీసులు ఆయననిఅరెస్ట్ అయ్యారు. తమిళనాడుపోలీసులు సహకరించారు. అరెస్టును ఆయన న్యాయవాది పీటర్ రమేశ్ ధ్రువీకరించారు.

 

సుప్రీం కోర్టు ధిక్కరణ కేసులో జస్టిస్ కర్ణన్ కు  ప్రధాన న్యాయమూర్తి కేహార్ అధ్యక్షతన ఉన్న ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆరు నెలల కారాగార శిక్ష విధించారు.  అయితే  నెలరోజులుగా తప్పించుకు తిరుగుతున్నారు.  

 

మే 9న సుప్రీం కోర్టు ఈ  ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి కర్ణన్‌ అచూకీ ఎవరికీ తెలియడం లేదు. తక్షణమే ఆయనను అరెస్టు చేయాలని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా దొరకలేదు.  ఇలా పరారీ ఉన్నపుడే ఆయన ఉద్యోగ విరమణ కూడ చేశారు.

 

click me!