అసెంబ్లీ నీళ్ల పైపులు కట్ చేశారని నివేదిక?

First Published Jun 10, 2017, 9:56 AM IST
Highlights

అసెంబ్లీలో పైప్ లైన్ కటింగ్ కేసులో ఆసక్తి కరమయిన విషయాలు వెల్లడి. నిర్మాణ లోపం కాకుండా ఉద్దేశపూర్యకంగానే పైప్‌ కట్‌ చేసినట్లు నిపుణుల దర్యాప్తు నివేదికలో రూపొందించినట్లు తెలిసింది.శుక్రవారం కాకినాడ జేఎన్టీయూ అధికారుల బృందం అసెంబ్లీని సందర్శించి అన్ని విభాగాలను కలియతిరిగి  పైపులు కట్ చేసినందువల్లే ప్రతిపక్షనేత కార్యాలయంలోకి వాన నీరు దుమికిందని నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.

 

 

అసెంబ్లీలో పైప్ లైన్ కటింగ్ కేసులో పురోగతి లభించింది. నిర్మాణ లోపం కాకుండా ఉద్దేశపూర్యకంగానే పైప్‌ కట్‌ చేసినట్లు నివేదికలో రూపొందించినట్లు తెలిసింది. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చాంబర్ లోకి నీళ్లు రావడంపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. వర్షపు నీరు కారడం నాసిరకంనిర్మాణం అని అందుకే జగన్ కార్యాలయంలోకి నీరు ఇంకిందని ప్రతిపక్షం  ఆరోపించింది. అంతా అనినీతి మయం అని దుమ్మెత్తిపోసింది.

అయితే, స్పీకర్ కోడెల శివప్రసాద్  మాత్రం ఇందులో ఎదో కుట్ర ఉన్నట్లు చెప్పారు. పైపులో  కోసేసినందునే నీళ్లు కారాయని అన్నారు. వెంటనే ఆయన సిఐడి దర్యాప్తునకు అదేశించారు. ఈ లోపు జెెఎన్ టియు నిపుణులను కూడా ఆయన పరిశీలించాలని కోరారు. స్పీకర్ అనుమానాన్ని దర్యాప్తు నిజం చేస్తున్నట్లుంది.

శుక్రవారం కాకినాడ జేఎన్టీయూ అధికారుల బృందం అసెంబ్లీని సందర్శించి అన్ని విభాగాలను కలియతిరిగి పరిశీలించారు. అనంతరం సీఐడీ అధికారులకు కాకినాడ జేఎన్‌టీయూ బృందం నివేదిక ఇచ్చారు. కాగా... పైప్‌లైన్ కట్‌ చేశారని నివేదిక రావడంతో సీఐడీ అధికారులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు.

click me!