కులం పేరుతో డిఎస్ పిని తిట్టిన టిడిపి మునిసిపల్ ఛెయిర్మన్

First Published Jun 9, 2017, 7:02 PM IST
Highlights

అనంతపురం ఏరువాక పర్యటన కొచ్చిన  ముఖ్యమంత్రి ఈ ఉదయం పుట్టపర్తి విమానాశ్రయంలో దిగారు. ఆయనకు స్వాగతం చెప్పటానికి ప్రథమ పౌరుడిగా మునిషిపల్  ఛెయిర్మన్ గంగన్న కూడా వచ్చారు. అయితే, పోలీసులు ఆయనను అనుమతించలేదు.ఇది అవమానం అంటూ ఆయన డిఎస్ పిని కులంపేరుతో తిట్టారు. ఈ కులం అధికారులొచ్చాక తనకు అవమాానాలు ఎదురవుతున్నాయని నిరసనగా రోడ్డు మీద బైఠాయించారు.గొడవ వీడియోలో చూడండి.

 

 

 

 

 

 

పుట్టపర్తి డిఎస్పి ని టీడీపీ మునిసిపల్ చైర్మన్ గంగన్న కులం పేరుతో దూషించారు. పోలీసులు తనను అవమానపరుస్తున్నారని, ఈ ‘కులం’ అధికారులొచ్చాక తనలాంటి వారికి అవమానం జరుగుతు ఉందని ఆయన అంటున్నారు. విషయం ఏమిటంటే, అనంతపురం ఏరువాక పర్యటనకొచ్చిన  ముఖ్యమంత్రి ఈ ఉదయం పుట్టపర్తి విమానాశ్రయంలో దిగారు. ఆయన స్వాగతం చెప్పటానికి ప్రథమ పౌరుడిగా గంగన్న కూడా వచ్చారు. అయితే, పోలీసులు ఆయనను అనుమతించలేదు. దీనితో గొడవ మొదలయింది.ఇది తనకు అవమానమని, దీనికి కారణం ఒక కులం అధికారులే నని గంగన్న వాపోయారు. ఈ అవమానానికి నిరసనగా   గంగన్న రోడ్డు మీద బైఠాయించారు. డిఎస్ పిని తిట్టినా పోలీసులు చాలా సంయమనం పాటిస్తున్నారు. కారణం దూషించిన వ్యక్తి అధికార పార్టీ నాయకుడు.

click me!