మోదీ భద్రతకు ఇజ్రాయిల్ జాగిలాలు

Published : Aug 06, 2017, 05:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
మోదీ భద్రతకు ఇజ్రాయిల్ జాగిలాలు

సారాంశం

ప్రమాదాలను గుర్తించడంలో ఈ జాగిలాలు ప్రపంచంలోనే ది బెస్ట్ ఇప్పటి వరకు ఇస్రాయిల్ లో పర్యటించిన తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ కావడం విశేషం

 

స్నిఫర్ డాగ్స్ గురించి వినే ఉంటారు.. ఎక్కడైనా బాంబులు ఉన్నాయనే సమాచారం రాగానే.. పోలీసులు వాటని వెంట పెట్టుకొని బాంబులు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టేస్తారు. అంతేకాదు నేరస్థులను పట్టుకోవడంలోనూ ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాదు, ఇవి అవసరమయినపుడు వుసి కొల్పితే అవతలి వ్యక్తి మీద దాడి చేసి చీల్చి చెండాడతాయి.  ఈ రకానివే స్నిఫ్ అండ్ అటాక్ డాగ్స్. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల భద్రతకు ఇపుడు వీటిని  వినియోగిస్తున్నారు. ఇప్పడు అలాంటి జాగిలాలనే భారత ప్రభుత్వం ఇస్రాయిల్ నుంచి తెప్పించింది. కాకపోతే.. ఇవి మాములు జాగిలాల కన్నా కొంచెం హైఎండ్. అంతేకాదు.. ప్రమాదాలను గుర్తించడంలో ఈ జాగిలాలు ప్రపంచంలోనే ది బెస్ట్. అందుకే వీటిని  ప్రధాని నరేంద్రమోదీ భద్రత దృష్ట్యా  తెప్పించారు.

గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 30 అటాక్ డాగ్స్, బాంబు స్నిఫర్ డాగ్స్, చేజర్స్ లను జెరుసలామ్ నుంచి తెప్పించినట్లు సీనియర్ సెక్యురిటీ అధికారి ఒకరు  తెలిపారు. కాగా.. ఇప్పుడు కొత్తగా మరికొన్ని డాగ్స్ ని  తెప్పించినట్లు ఆయన చెప్పారు. ఈ సారి తెప్పించిన డాగ్స్.. పేలుడు పదార్ధాలను గుర్తించడంలో  ప్రపంచంలోనే  ది బెస్ట్ అని వారు చెప్పారు. ఈ కానైన్లు - లాబ్రడార్లు, జర్మన్ షెప్పర్లు, బెల్జియన్ మాలిటియోస్ జాతులకు చెందిన ఈ కుక్కలు ప్రమాదాలను త్వరగా పసిగొడతాయని  ఆయన తెలిపారు.

ఇవన్నీ ఇస్రాయిల్ రక్షణ రంగానికి చెందినవేనని అధికారి పేర్కొన్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్రమోదీ కి ముప్పు ఎక్కువగా ఉంది కాబట్టి.. ఈ మాత్రం భద్రత చాలా అవసరమని చెప్పారు.

మోదీ గత నెలలో ఇస్రాయిల్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఇస్రాయిల్ లో పర్యటించిన తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ కావడం విశేషం. ఇస్రాయిల్ లో మూడు రోజుల పాటు పర్యటించిన మోదీ.. ఆ దేశ ప్రధాని బెంజామిన్ నెటాన్యుహుతో భద్రత, రక్షణ తదితర అంశాల గురించి చర్చించారు.  ఈ నేపథ్యంలో మోదీ అక్కడి నుంచి ఈ స్నిఫర్ డాగ్స్ ను తెప్పించుకున్నారు. వీటి ధర మాత్రం అధికారులు గోప్యంగా ఉంచారు.

ఈ డాగ్స్ కి దాదాపు 6నెలలపాటు శిక్షణ ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. ఈ శిక్షణ కాలంలో కుక్కలకు ప్రతేయకమైన ఆహారాన్ని అందజేస్తారు.  అంతేకాకుండా వీటిని హైజెనిక్ వాతావరణంలో ఉంచుతారట. వాటికి ప్రతక్యేకంగా అన్ని అవసరాలను ఏర్పాటు చేస్తారు.  అంతేకాదు.. వాటకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. వాటికి తరచూ వైద్యలు చేత పరీక్షలు కూడా చేయిస్తూ ఉంటారని భద్రతా అధికారి తెలిపారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి భద్రత కల్పించాలంటే ఈ మాత్రం ఉండాల్సిందేలే.. ప్రధానితోపాటు ఈ జాగిలాల భద్రత సౌకర్యం సోనియాగాంధీ కుటుంబసభ్యలు కూడా వర్తిస్తుంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !