
అభిమానుల ప్రార్థనలే తనను బ్రతికించాయని బాలీవుడ్ బిగ్ బి అబితాబ్ బచ్చన్ అన్నారు. 1982వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన అమితాబ్ కూలి చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ లో భాగంగా తన తోటి నటుడు పునీత్ ఇస్సార్ తో కలిసి యాక్షన్ సీన్ తీస్తుండగా..అనుకోకుండా ప్రమాదం జరిగి గాయాలపాలయ్యారు. ఈ సంఘటన జరిగి నేటికి సరిగ్గా 35 సంవత్సరాలు.
ఈ చిత్ర షూటింగ్ బెంగళూరులో జరగగా..తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం ముంబయి తరలించారు. అనంతరం ఆయన క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఆగస్టు 2వ తేదీని ఆయన తన రెండో పుట్టిన రోజుగా భావిస్తారు. కాగా.. అభిమానుల ప్రార్థనల మేరకే తాను బ్రతికానని ఆయన ఈ రోజు గుర్తు చేసుకున్నారు.ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.