
పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో కలుస్తున్నారనే విషయం కాపులందరికి తెటతెల్లమయింది. దీనితో కాపులలో చీలికమొదలయింది. కాపు-కమ్మ వైరమెలా ఉన్నా పవన్ కల్యాణ్ చంద్రబాబుతో చేతులుకలపడం వల్ల కాపులలో చీలిక వచ్చేలా అంది. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో చేతులు కలుపుతాడన్న విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చ రగిలించింది. అనుకున్నట్లుగానే కాపులు రెండుగా చీలిపోయారు. ఒక వర్గం బలమయిన లాజిక్కుతో పవన్ కల్యాణ్ ను సమర్థిస్తుంటే మరొక వైపు చంద్రబాబు ఉచ్చులో పడవద్దన్న కాపు నేత ముద్రగడ పద్మనాభం సూచనను సమర్థిస్తున్నారు. సోషల్ మీడియాలో కాపు చర్చ ఆసక్తి కరంగా సాగుతున్నది. కాపులు రెండు గా చీలిపోతున్నారని ఈ చర్చను బట్టి తెలుస్తుంది.చాల మంది కాపు యువకులు పవన్ కల్యాణ్ ను కేవలం కాపు రాజకీయాలకు కట్టేయదల్చుకోలేదు.ఆయన కాపు రాజకీయాలకు అతీతంగా ఎదగాలని, జగన్ , చంద్రబాబు లాగా రాష్ట్ర నాయకుడు కావాలని కోరుతున్నారు.
. ‘చంద్రబాబు ఎప్పుడైనా జై కమ్మ అన్నారా???
జగన్ ఎక్కడైనా జై రెడ్డి అన్నారా???
మరి పవన్ ఎందుకు జై కాపు అనాలి...?
ఏమిటీ గొడవ....ఎందుకీ బలవంతం....
ఒక కన్ను పోయింది ఇప్పుడు రెండో కన్నును ఎందుకు పొడుచుకుంటున్నారు???????
ఆ పవనం వీచేది సమాజ వికాసానికి......
ఇన్ని లక్షల మంది వున్నాము కదా...
మన బాధలు...మనమే పడదాం
మన పోరాటం మనమే చేద్దాం
ఆ ఒక్కడిని వదిలేద్దాం గర్వంగా
ఈ సమాజానికి కాపుల బహుమానంగా జనసేన...’ అని దాసరి రవికుమార్ నాయుడు పవన్ –చంద్రబాబు చేతులు కలపడాన్ని వ్యతిరేకిస్తున్న వారికి ఫేస్ బుక్ లో సలహా ఇచ్చారు.
కొందరు ‘ చంద్రబాబు ఉచ్చులో పడవద్దు’ అని ముద్రగడ చేసిన సలహాను సమర్థిస్తే మరికొందరు ‘నువ్వుజగన్ ఉచ్చులో పడవద్దు’ అని ముద్రగడకు ఎదురు సలహా ఇచ్చారు.
కొందరు అతితెలివి పనికిరాదు, ప్రస్తుతపరిస్థితులకు అనుగుణంగా మసలుకోవాలని సలహా కాపులకు సలహా ఇచ్చారు.
యర్రంశెట్టి సురేశ్, పవన్ ను వెనకేసుకొస్తూ, ‘వన్ కాకుండా మిగతా వారు యేమయ్యారు .
dont target పవన్.ఆయన యేమి చేసినా ప్రజల మంచి కోసమే అని మరువకండి.’ అని హితవు చేశారు.
కాపు-కమ్మ రాజకీయ వైరం మాట ఎలా ఉన్నా, పవన్ కల్యాణ్ చంద్రబాబు తో చేతులకలపడాన్ని హర్షించే కాపులు చాలా మంది ఉన్నారు. ఏదో విధంగా ఒక కాపునేత ‘పవర్’ ఫుల్ గా ఉండాలన్నదే చాలా మంది కోరిక.