
పవన్ నేతృత్వంలోని జనసేన ప్రజలకు తోడుండేందుకు నడుం బిగించింది.జనసైనికుల ప్రజలు కష్టాలు తెలుసుకుని తీర్చేందుకు కృషి మొదలుపెట్టారు. ఈ రోజు నెల్లూరు జిల్లా నాయుడుపేట రాజగోపాలపురంలో మంచినీళ్ల కోసం ప్రజల కటకటలాడుతున్నారనే సమాచారం జనసేన పార్టీకి అందింది.
వర్షం వల్ల వీధిలో మురుగు నీరు నిల్వ ఉండిపోయి తాగునీరు సైతం కలుషితమైపోయింది ఈ ప్రాంతంలో. వెంటనే నీటి కష్టాలు తీర్చేందుకు జనసైనికులు ముందుకు వచ్చారు. ఈ పరిస్థితి తెలుసుకున్న జనసేన సేవా దళ్ నీటి ట్యాకర్లతో రాజగోపాలపురం ప్రజల వద్దకు వెళ్లింది.
దీనితో ఈ ప్రాంతమంతా జనసేన మంచినీళ్లొచ్చాయని ఒక సందడి.
ఈ కార్యక్రమంలో జనసేన సేవా దళ్ నాయుడుపేట సభ్యులు యాసిన్ షేక్, గిండి సతీష్ కుమార్, లీలామోహన్, యష్వంత్ పాల్గొని ప్రజలకు నీరందించారు.
ప్రజల ఇక్కట్లు తీర్చేందుకు తాము చేయగలిగిందంతా చేస్తామని సేవాదళ్ నేతలు ఏషియానెట్ ప్రతినిధికి తెలిపారు.