
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బిజెపి లు కలసి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తున్నందున ఆంధ్రప్రదేశ్ ఎన్ డి ఎ కు వ్యతిరేకంగా ప్రత్యామ్నయ మూడో కూటమిని ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. దీనికి జనసేన నేత పవన్ కల్యాణ్ నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సిపిఐ ఆంధ్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు.
పవన్ ఈ మూడేళ్లలో పవన్ బిజెపి,టిడిపిల పాలనతో అసంతృప్తిగా ఉన్నారని ,అందువల్ల ఆయన మూడో ప్రత్నామ్నాయానికి నాయకత్వం వహించేందుకు ముందుకు వస్తారని రామకృష్ణ వెల్లడించారు.
రామకృష్ణ పవన్ తో చర్చలు సాగిస్తున్న విషయం తెలిసిందే.
రాజమహేంద్ర వరం నుంచి ఈ రోజు ఏషియానెట్ ప్రతినిదితో మాట్లాడుతూ,ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బిజెపి అనుకూల ధోరణియే తీసుకోవడంతో ఆంధ్రలో మూడోకూటమి అనివార్యమవుతూ ఉందని ఆయన చెప్పారు. మూడో కూటమి ఏర్పాటుకు అవకాశాలు బలపడుతున్నాయని ఆయన అన్నారు.
మూడేళ్ల తర్వాత మోడీ అసలు బండారం బయటపడుతున్నదని చెబుతూ కేంద్రమంత్రులు, బిజెపి ఎంపీలు, ఎంఎల్‌ఎలు మోడీ పాలన బాగుందని మోడీ భజన చేస్తుంటే, దేశమంతా రైతులు మోదీ వైఫల్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని అన్నారు. మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంవల్లే తమిళనాడు, రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్‌లలో రైతులుపోరాట బాట పట్టారని ఆయన చెప్పారు.