విన్నారా జైట్లీ మాటలు

Published : Dec 30, 2016, 01:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
విన్నారా జైట్లీ మాటలు

సారాంశం

క్యూలైన్లోల నిలబడకపోతే ఆమాత్రం డబ్బు కూడా చేతికి అందదన్న ఆందోళనతోనే అందరూ క్యూలైన్లలో నిలబడ్డారు.

అరుణ్ జైట్లీ మాటలు విన్నారా? పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఊహించినంత ఎక్కువగా లేదట.  పైగా పన్ను వసూళ్లు పెరగటంతో పాటు వ్యవసాయ పనులు, ఆర్ధిక కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నట్లు చెబుతున్నారు. అంటే జైట్లీ దేశ ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారు?

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి చెప్పిన గడువు అయిపోయింది. గడచిన 50 రోజులుగా దేశం అల్లకల్లోలమైపోయింది. పరిస్ధితి నానాటికీ దిగజారిపోతోందే కానీ మెరుగుపడుతున్న దాఖాలాల్లేవు. అన్నీ రంగాలూ కుదేలైపోయాయి. ఇటువంటి పరిస్ధితుల్లో దేశంలో అంతా బాగుంది అని చెప్పటానికి జైట్లీ మాత్రం నానా అవస్తులు పడుతున్నారు.

 

వ్యవసాయ పనులు మామూలుగానే సాగుతున్నాయని, పన్ను వసూళ్లు పెరిగిందని, డిజిటల్ లావాదేవీలు కూడా పెరగుతున్నట్లు జైట్లీ చెప్పటం గమనార్హం. నగదు లావాదేవీలు తగ్గించటానికే ప్రధాని పెద్ద నోట్ల రద్దు చేసినట్లు జైట్లీ చల్లగా చెబుతున్నారు. డిజిటల్ లావాదేవీలు పెంచాలంటే ఉన్నపళంగా పెద్ద నోట్లు రద్దు చేయమని చెప్పిన ఆర్ధిక శాస్త్రవేత్తలెవరో?

 

దేశవ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు రియల్ ఎస్టేట్, రవాణా, వైద్యం, వర్తక, వాణిజ్య రంగాలు, అసంఘటిత రంగం కూడా దారుణంగా దెబ్బతిన్నట్లు ఆయా రంగాల్లోని నిపుణులు మొత్తుకుంటున్నారు. బ్యాంకింగ్ రంగ నిపుణులు కూడా దేశ ఆర్ధిక వ్యవస్ధే కుదేలైపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

 

ఇటువంటి నేపధ్యంలో డీమానిటైజైషన్ ఎఫెక్టే అసలు దేశంపై లేదని జైట్లీ నమ్మబలకటం ఆశ్చర్యం. పైగా దేశానికి పెద్ద నోట్ల రద్దు ఎంతో మేలు జరిగిందని కూడా చెబుతున్నారు. నగదు చెలామణి లేనపుడు డిజిటల్ లావాదేవీలు పెరగక ఏమౌతుంది? కొత్త నోట్ల జారీ ముమ్మరంగా సాగుతోందని చెబుతున్నారు. ఎక్కడ సాగుతోంది.

 

ఇప్పటికీ డబ్బుల కోసం బ్యాంకులు, ఏటిఎం ముందు కనబడుతున్న క్యూలైన్లు దేనికి సంకేతాలు, డబ్బు విత్ డ్రాపై పరిమితులెందుకున్నట్లు?

 

దేశ ప్రజలు నోట్ల రద్దుకు మద్దుతు తెలిపారని చెప్పటంకన్న హాస్యాస్పదమం ఇంకోటి లేదు. క్యూలైన్లోల నిలబడకపోతే ఆమాత్రం డబ్బు కూడా చేతికి అందదన్న ఆందోళనతోనే అందరూ క్యూలైన్లలో నిలబడ్డారు. ఇక, అన్నీ రకాల పన్నులూ పెరిగాయంటున్నారు.

 

చేతిలో ఉన్న డబ్బు ఫలానా తేదీ తర్వాత పనికిరాదని చెప్పినపుడు, కనీసం పన్నులు చెల్లింపులైనా చేస్తే బకాయిలు చెల్లించినట్లుంటుందని ప్రజలందరూ పన్నులు చెల్లించారు. దాన్నే తమ ఘనతగా జైట్లీ చెప్పుకోవటం నిజంగా సిగ్గు చేటు.

 

ప్రజలు స్వచ్చందంగా పన్నులు చెల్లించినపుడు లేదా ప్రభుత్వం ముక్కుపిండి ఎగవేతదారుల నుండి వసూళ్ళు చేసినపుడే ప్రభుత్వ ఘనత. ఏదేమైనా మోడి చెప్పిన ‘నవభారత ఆవిష్కరణ’కు గడువు అయిపోయింది కాబట్టి ఏమి జరుగుతుందో చూడాలి

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !