జగన్ పాదయాత్ర రెండో రోజు షెడ్యూల్ ఇదే...

Published : Nov 06, 2017, 05:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
జగన్ పాదయాత్ర రెండో రోజు షెడ్యూల్ ఇదే...

సారాంశం

వైసీపీ అధినేత జగన్.. ప్రజా సంకల్ప యాత్ర సోమవారం మొదలైంది. ఇడుపుల పాయలో మొదలైన ఈ యాత్ర ఇప్పటికే 5కిలోమీటర్ల మేర సాగింది.

వైసీపీ అధినేత జగన్.. ప్రజా సంకల్ప యాత్ర సోమవారం మొదలైంది. ఇడుపుల పాయలో మొదలైన ఈ యాత్ర ఇప్పటికే 5కిలోమీటర్ల మేర సాగింది. కాగా..ప్రజా సంకల్ప యాత్ర రెండో రోజు షెడ్యూల్‌ను జగన్ తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

 ఆయన మంగళవారం పులివెందుల, కమలాపురం నియోజక వర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. ఇడుపులపాయ-వేంపల్లి రోడ్డు మీదుగా రెండో రోజు యాత్ర సాగనుంది. రెండో రోజు మొత్తం  12.6 కిలో మీటర్లు సాగే పాదయాత్ర నీలతిమ్మాయపల్లి సమీపంలో ముగుస్తుంది.

 

కాగా, తొలి రోజు వైఎస్ఆర్‌ ఘాట్‌ దగ్గర నివాళి అర్పించిన వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ..ఉదయం 9 గంటల 47 నిమిషాలకు తొలి అడుగు వేశారు.  ఇడుపుల పాయలో నిర్వహించిన బహిరంగ సభకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు వేలది సంఖ్యలో తరలి వచ్చారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !