వైసీపీలో మిగిలేది ఐదుగురేనా?

First Published Nov 6, 2017, 3:05 PM IST
Highlights
  • జగన్ పై విరుచుకుపడ్డ అచ్చెన్నాయుడు
  • పాదయాత్ర వల్ల తమకు ఎలాంటి నష్టం లేదన్న మంత్రి

జగన్ పాదయాత్ర ముగిసే నాటికి ఆ పార్టీలో కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే మిగులుతారట.. ఈ మాట చెబుతుంది మరెవరో కాదు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. సోమవారం ఇడుపుల పాయ నుంచి జగన్ పాదయాత్ర మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ ని విమర్శిస్తూ.. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.

పాదయాత్ర ముగిసే నాటికి జగన్ కుటుంబసభ్యులతో పాటు ఐదుగురు సభ్యులు మాత్రమే మిగలతారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.పాదయాత్ర కారణంగా తమ ప్రభుత్వానికి, పార్టీకి  ఎటువంటి నష్టం కలగదని ఆయన పేర్కొన్నారు. జగన్ అసెంబ్లీని బహిష్కరించి పాదయాత్ర చేయడం సరికాదని ఆయన చెప్పారు. 

అయితే... ఐదుగురు సభ్యులు మాత్రమే మిగులుతారు అనే మాటలపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. వైకాపా నేతలను అచ్చెం నాయుడు పాండవులతో పోల్చారని సంబరపడిపోతున్నారు. కురక్షేత్రంలో చివరకు విజయం సాధించింది ఐదుగురు సభ్యులున్న పాండవులే గానీ.. 100మంది ఉన్న కౌరవులు కాదన్న విషయం అచ్చెన్నాయుడు మర్చిపోయారేమో అని పలువురు వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.

click me!