సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న జగన్

Published : Nov 07, 2017, 03:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న జగన్

సారాంశం

ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్ జగన్ కి పెరుగుతున్న మద్దతు దారులు సోషల్ మీడియాలో జగన్ మానియా

వైసీపీ అధినేత జగన్ కి యువత నుంచి మద్దతు పెరుగుతోంది. జగన్.. సోమవారం నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ యాత్రను టార్గెట్ చేస్తూ ఓ వైపు అధికార పార్టీ నేతలు విమర్శాస్త్రాలు కురిపిస్తున్నారు. మరో వైపు ఆయనకు సోషల్ మీడియాలో మద్దతుదారులు పెరిగిపోతున్నారు.

ఎంతలా అంటే.. ప్రస్తుతం ఆయన వేంపల్లి గ్రామంలో స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఈ ముఖాముఖికి సంబంధించిన వీడియోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లైవ్ వీడియో పేరిట వైసీపీ విభాగం ఫేస్ బుక్ లో లైవ్ లో పెట్టారు. ఆ వీడియోలను జగన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయగా... ఆ వీడియో వేలల్లో వీక్షించారు.

ఒకవైపు సాక్షి టీవీ చూసేవాళ్లు టీవీలో చూస్తుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో చూసేందుకు కూడా జనాలు ఎగపడుతున్నారు. ఈ ఒక్కటి చాలు ఆయనకు మద్దతు ఏవిధంగా ఉందో. కేవలం ఇదే కాదు.. ఆయన పేరిట సోషల్ మీడియా గ్రూపులు కూడా వెల్లువెత్తుతున్నాయి. జగన్ సీఎం కావాలని కోరుతూ వారు ఆ గ్రూపులు ఏర్పాటు చేసి ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !