నంద్యాల మీద వల్ల మాలిన ప్రేమ: అపుడే 33 వాగ్దానాలా బాబూ!

Published : Jul 13, 2017, 02:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
నంద్యాల మీద వల్ల మాలిన ప్రేమ: అపుడే 33 వాగ్దానాలా బాబూ!

సారాంశం

ఎన్నికల తేదీలే రాలేదు నంద్యాల ప్రజలకు అపుడే సిఎం 33 వాగ్దానాలు చేశారు నంద్యాల ఉప ఎన్నికలకు ఇంత ప్రాధాన్యం ఎందుకు? మరొకవైపు పోలీసులతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు ఓటుకు అయిదు వేలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు

నంద్యాల ప్రజల మీద  చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా  వల్ల మాలిన ప్రేమ చూపించడం అందరికీ ఆశ్చర్యం కల్గిస్తూ ఉంది. ఇది, ‘ మా ఎమ్మెల్యే చచ్చిపోతే ఎంత బాగుంటుందో అని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చేలా ఉంది,’ అని ఎవరో కాదు, స్వయాన టిడిపి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి నివ్వెరపోయారు.

వైసిపి నాయకుడు బోత్స సత్యనారాయణ లెక్క ప్రకారం, నంద్యాల ఉప ఎన్నికకు ఇంకా నోటీఫికేషన్ రాలేదు, అపుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 33 వాగ్దానాలు చేశారు.ఉప ఎన్నికలు రాష్ట్రంలోచాలా సందర్భాల్లో వచ్చాయి,ఎపుడే ఎవరికి  ఇన్ని వాగ్దానాలు  అంద లేదు.నంద్యాల ఉప ఎన్నికకు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారని  బోత్స విస్తుపోతున్నారు.

ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా నంద్యాల ఉప ఎన్నిక అక్రమాలు,అరాచకాలతో గెలవాలని టీడీపీ భావిస్తున్నదని ఆయన అనుమానిస్తున్నారు. హామీ లే కాదు, నంద్యాలో  ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని కూడా బోత్స అరోపించారు.

‘పోలీసులతో బలహీనవర్గాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.జిల్లా మంత్రి పోలీసుల చర్యకు వత్తాసు పలికారు.పదేళ్లు నేను మంత్రిగా చేశాను, ఎప్పుడైనా ఇలా జరిగిందా,’ అని బోత్స ప్రశ్నించారు.

డబ్బులిచ్చి ఓట్లు కొనేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని ఆరోపిస్తూ దోచుకున్న డబ్బుతో ఓటుకు ఐదు వేలు ఇవ్వగలనని చంద్రబాబు చూస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలను బిక్షగాళ్లలా చూడటంమానుకోవాలని సలహా ఇచ్చారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !