ఉప రాష్ట్రపతి రేసులో లేనట్టేనా...!

Published : Apr 26, 2017, 12:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఉప రాష్ట్రపతి రేసులో లేనట్టేనా...!

సారాంశం

మే 2 తర్వాత నరసింహన్ పదవీ కాలం ముగియనుంది. ఈ లోపు దీనిపై కేంద్రం ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. గవర్నర్ నియామకంలో కేంద్రానిదే అంతిమ నిర్ణయం కాబట్టి ఎన్టీయే సర్కారు ఏం చేస్తుందో చూడాలి.

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీకాలం వారంలో ముగియబోతోంది. మే 2 తర్వాత తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా ఎవరు రాబోతున్నారు... ఈయననే కంటిన్యూ చేస్తారా... లేక కొత్త వారిని నియమిస్తారా... ఇంత వరకు ఈ విషయంపై క్లారిటీ రాలేదు.

 

ఇటీవల ఉపరాష్ట్రపతి రేసులో నరసింహన్ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనను ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చొబెట్టడానికి సహకరిస్తామని చెప్పినట్లుగా కూడా తెలిసింది.

 

ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చాక ఒక్క నరసింహన్ ను తప్పతే కాంగ్రెస్ నియమించిన అందరి గవర్నర్లను ఇంటికి పంపింది.

ముఖ్యంగా ఇక్కడ విభజన సమస్యలు ఉండటంతో పాటు, ప్రత్యేక.. సమైక్య ఉద్యమాల సమయంలో నరసింహన్ గవర్నర్ గా కీలకపాత్ర పోషించడంతో ఆయనను కదిపే సాహసం ఎన్డీయే సర్కారు చేయలేదు.

 

రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాక ఇప్పడు ఇద్దరు సీఎంలకు సయోధ్య కుదర్చడంలోనూ నరసింహన్ చాలా యాక్టివ్ గానే పనిచేశారు. అందుకే ఉపరాష్ట్రపతిగా నరసింహన్ ను నియమించే ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ అంగీకరించారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.

 

అయితే మే 2 తర్వాత నరసింహన్ పదవీ కాలం ముగియనుంది. ఈ లోపు దీనిపై కేంద్రం ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. గవర్నర్ నియామకంలో కేంద్రానిదే అంతిమ నిర్ణయం కాబట్టి ఎన్టీయే సర్కారు ఏం చేస్తుందో చూడాలి.

 

అయితే నరసింహన్ కు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేందుకు కమలనాథులు సిద్ధంగా లేరని తెలుస్తోంది. కాబట్టి ఆయన మళ్లీ గవర్నర్ గానే ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే అది మళ్లీ తెలుగు రాష్ట్రాలకా లేక వేరే రాష్ట్రానికా అనేది తెలియదు.

 

నరసింహన్ రికార్డు స్థాయిలో ఉమ్మడి ఏపీకి 9 ఏళ్లుగా గవర్నర్ గా పనిచేశారు. కాబట్టి ఆయనను వేరే రాష్ట్రానికి గవర్నర్ గా పంపే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !