భాజపా: బాగానే దెబ్బ కొట్టింది

Published : Apr 26, 2017, 09:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
భాజపా: బాగానే దెబ్బ కొట్టింది

సారాంశం

కావాలనే కేజ్రీవాల్ ను రెచ్చగొట్టింది. అసలే ఆవేశపరుడైన కేజ్రీ ప్రతీ చిన్న విషయానికీ అటు కేంద్రప్రభుత్వంతోనూ ఇటు ఎల్జీతోనూ గొడవే. దాన్ని అవకాశంగా తీసుకున్న భాజపా జనాల దృష్టిలో కేజ్రీని ఒక పేచీకోరుగా చిత్రీకరించటంలో విజయం సాధించింది. సిఎంగా కేజ్రీ పనితనానికి బదులు జనాలు కూడా భాజపా ప్రచారాన్నే గుర్తుపెట్టుకున్నారేమో.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమలం పార్టీ ఆప్ ను చావు దెబ్బే కొట్టింది. మూడేళ్ళ ఆమ్ ఆద్మి పార్టీ (ఆప్)పాలనపై సామాన్య జనాల్లో సానుకూల స్పందనే ఉన్నా ఇంత ఘోరంగా ఓడిపోవటం ఆశ్చర్యంగా ఉంది. దశాబ్దాల పాటు జనాలను పట్టి పీడిస్తున్న అనేక సమస్యల పరిష్కారానికి కేజ్రీవాల్ బాగానే పనిచేస్తున్నట్లు అనేక సందర్భాల్లో జనాలు మెచ్చుకున్నారు కూడా.

పైగా ఢిల్లీకి ముఖ్యమంత్రి అంటే పావుభాగానికే సిఎం.  ఎందుకంటే, ఢిల్లీలో ముఖ్యమంత్రి కన్నా లెఫ్ట్ నెంట్ జనరల్(ఎల్జీ)పవర్ ఫుల్లు. సిఎంకు మించిన అధికారాలు ఎల్జీకున్నాయి. కేజ్రీవాల్ కు అదే పెద్ద సమస్యగా మారింది. ఏ వ్యవస్ధతో పనిచేయిద్దామన్నా నిబంధనలు అడ్డు. ప్రతీదానికి ఎల్జీ ఆమోదం తప్పనిసరి. ముఖ్యమంత్రి స్వేచ్ఛగా పనిచేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీనే ఢిల్లీ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండాలి. లేదంటే కేజ్రీవాల్ పరిస్ధితే.

ఇక్కడే భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కావాలనే కేజ్రీవాల్ ను రెచ్చగొట్టింది. అసలే ఆవేశపరుడైన కేజ్రీ ప్రతీ చిన్న విషయానికీ అటు కేంద్రప్రభుత్వంతోనూ ఇటు ఎల్జీతోనూ గొడవే. దాన్ని అవకాశంగా తీసుకున్న భాజపా జనాల దృష్టిలో కేజ్రీని ఒక పేచీకోరుగా చిత్రీకరించటంలో విజయం సాధించింది. సిఎంగా కేజ్రీ పనితనానికి బదులు జనాలు కూడా భాజపా ప్రచారాన్నే గుర్తుపెట్టుకున్నారేమో.

అదీకాకుండా ప్రస్తుత ఎన్నికల్లో ఆప్ కు ఒక్క కేజ్రీ మాత్రమే స్టార్ క్యాంపైనర్. అదే భాజపా విషయానికి వస్తే మోడి, అమిత్ షా దగ్గర నుండి కొన్ని వందల మంది ప్రచారంలో పాల్గొన్నారు. అపరిమితమైన అర్ధ, అంగ బలం కూడా భాజపాకు తోడైంది. దానికితోడు పోలైన ఓట్లు కూడా 52 శాతమే.  ఢిల్లీ లాంటి చోట్ల కూడా ఓటింగ్ శాతం అంత తక్కువగా ఉండటం ఆశ్చర్యం.  

ఇదే విషయమై ఆప్ తెలంగాణా కన్వీనర్ ప్రొఫెసర్ విశ్వేస్వర రావు ‘ఏషియానెట్’ తో మాట్లాడుతూ, కేజ్రీవాల్ పై భాజపా బాగా వ్యతిరేక ప్రచారం చేసిందన్నారు. సామాన్య జనాల్లో కేజ్రీ పనితనంపై సానుకూల అభిప్రాయమే ఉందన్నారు. విద్య, వైద్య, ఆరోగ్యం, రవాణా, మంచినీటి సమస్యల పరిష్కారంలో కేజ్రీ బాగానే కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఓటింగ్ శాతం బాగా తక్కువగా ఉండటం, అధికారాలన్నీ కేంద్రప్రభుత్వం వద్దే కేంద్రీకృమవటం కూడా కేజ్రీ స్వేచ్ఛగా పనిచేయలేక పోవటానికి కారణాలుగా ప్రోఫెసర్ అభిప్రాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !